Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గీత గోవిందం''లో ఆ ఘాటు ''ము'' సీన్‌ను తొలగించారట.. కారణం ఎవరంటే?

గీత గోవిందం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాలోనే లిప్ లాక్‌లతో వార్తల్లోకి నిలిచిన విజయ్ దేవరకొండ మళ్లీ అదే కిస్ సీన్లు చేసి వార్తల్లో నిలిచాడు. తెలుగు సినిమ

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (14:13 IST)
గీత గోవిందం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాలోనే లిప్ లాక్‌లతో వార్తల్లోకి నిలిచిన విజయ్ దేవరకొండ మళ్లీ అదే కిస్ సీన్లు చేసి వార్తల్లో నిలిచాడు. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం ముద్దు సన్నివేశాలు కామన్ అయిపోయిన నేపథ్యంలో తాజాగా విడుదలైన ''గీత గోవిందం''లోనూ ఓ ముద్దు సన్నివేశాన్ని ప్లాన్ చేశారట.


కానీ దాన్ని చివరి నిమిషంలో తొలిగించారని, దానికి కారణం హీరోయిన్ రష్మిక మందన అని తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. బాలీవుడ్‌లో ఇమ్రాన్ హస్మీన్ పేరు వినగానే గుర్తొచ్చేది ముద్దుల సన్నివేశాలే.
 
అలాగే హీరో విజయ్ అంటే కూడా ''అర్జున్‌రెడ్డి'' నుంచి యువతలో ఆయనపై అదే ఒపినీయన్ వుంది. దీంతో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన ''గీత గోవిందం''లోనూ ఓ ముద్దు సీన్ ప్లాన్ చేశారట చిత్ర బృందం. అంతే బస్సులో రష్మిక అర్జున్ రెడ్డికి ఇచ్చే కిస్‌ సీన్‌ను షూట్ చేశారు. అలాగే, సినిమా క్లైమాక్స్‌‌లో కూడా చిత్ర యూనిట్ ఓ మంచి ముద్దు స‌న్నివేశం షూట్ చేశారని... అది చాలా ఘాటు ముద్దు సన్నివేశమని తెలిసింది. ఈ సీన్లో హీరోహీరోయిన్ ఒక‌రిపై మ‌రొక‌రు కూర్చుని ముద్దు పెట్టుకుంటారట. కానీ, మూవీలో మాత్రం దాన్ని చూపించ‌లేదు. 
 
ఇద్ద‌రూ ముద్దు కోసం ద‌గ్గ‌ర‌వ‌డంతో టైటిల్ కార్డ్స్ ప‌డిపోయాయి. దీంతో కావాల‌నే ఆ ముద్దు సీన్ క‌ట్ చేశార‌ని సమాచారం. ఈ మూవీ విడుదలకు కొన్ని రోజుల ముందే కథనాయిక ర‌ష్మిక పెళ్లిపై పుకార్లు రావ‌డంతోనే అలా చేశార‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ర‌ష్మిక కోరిక మేరకే ఆ ముద్దుని అలా ఆపేశార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments