Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్మణి రాంబో ఖతీజా చిత్రాన్ని గాయ‌త్రి ఫిలింస్ రిలీజ్‌చేస్తోంది

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:41 IST)
Vijay Sethupathi, Nayana Tara, Samantha
సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన కోలీవుడ్ స్టార్, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌య‌న తార‌, స‌మంత హీరోయిన్స్‌గా విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’. ఈ సినిమాను ఏప్రిల్ 28న భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన రెండు రెండు..అనే పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్ చూస్తే కామ‌న్ ఆడియెన్స్ సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌నే సంగ‌తిని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. 
 
అంత‌కు ముందు విడుద‌లైన ‘కన్మణి రాంబో ఖతీజా’ టీజ‌ర్‌, రీసెంట్‌గా విడుద‌లైన ‘టు టు..’ సాంగ్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను గాయ‌త్రి దేవి ఫిలింస్ సంస్థ ద‌క్కించుకుంది. ఏప్రిల్ 28న రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రాన్ని భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి గాయ‌త్రి ఫిలింస్ అధినేత స‌తీష్ స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
నిర్మాణం: 7 స్క్రీన్‌ స్టూడియో, రౌడీ పిక్చర్స్, నిర్మాత: లలిత్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్‌, సంగీతం: అనిరుద్‌ రవిచంద్రన్‌, కెమెరా: ఎస్‌ఆర్‌ కదిర్‌, విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ఆర్ట్: వ్వేత సెబాస్టియన్‌, యాక్షన్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌,  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మయిల్‌వాగనన్‌ కె.ఎస్‌., లైన్‌ ప్రొడ్యూసర్‌: గుబేందిరన్‌ వీకే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments