Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న నాగ చైతన్య హీరోయిన్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:14 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" చిత్రం. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటించారు. ఇపుడు ఈ భామ పెళ్లిపీటలెక్కనున్నారు. కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు, సీనియర్ హీరో కార్తీక్ తనయుడైన గౌతం కార్తీక్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. 
 
గతంలో గౌతం కార్తీక్, మంజిమా మోహన్‌లు కలిసి 'దేవరాట్టం' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు కదా తోసిపుచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతుందన్న విషయం నిర్ధారణ అయింది. 
 
అయితే, ఇపుడు ఈ ప్రేమ జంట తమతమ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై త్వరలోనే వారిద్దరూ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments