Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు.. బాలయ్య చేతుల మీదుగా...

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు న

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (17:53 IST)
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమీపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా  కావ‌డంతో సినిమా ప్రారంభం నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. 
 
ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రానికి సంబంధించి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ‌, వశిష్టిదేవిగా శ్రియాశ‌ర‌న్ ప్రీలుక్స్‌‌కు ఇటు నందమూరి అభిమానులు, అటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు నుంచి మంచి స్పందన వ‌చ్చింది. ఇప్పుడు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌య్య ముహుర్తాన్ని నిర్ణ‌యించారు. అక్టోబ‌ర్ 9న శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రాయ‌ల్ లుక్ విడుద‌ల కానుండ‌గా, స‌క‌ల విజ‌యాల‌ను క‌లుగు జేసే విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే అక్టోబ‌ర్ 11 ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ... ''నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న గౌత‌మీపుత్ర శాత‌కర్ణి సినిమా సినిమాలో నాలగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవల మ‌ధ్య ప్ర‌దేశ్‌లో జ‌రిగిన నాలుగో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో రాజసూయ యాగాన్ని నిర్వహ‌ణ స‌న్నివేశంతో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను, ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ఐదో షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా టాకీకి సంబంధించి మేజర్ పార్ట్ అంతా పూర్తయ్యింది. గౌతమీపుత్ర శాతకర్ణి ఫ‌స్ట్‌ లుక్‌ను అక్టోబ‌ర్ 9న, టీజ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు. 
 
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రియా, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే కాల్‌"తో సురక్షితంగా బయటపడిన విమానం... ఎక్కడ?

భార్యకు మరో వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. నుదుట సింధూరాన్ని తుడిచి.. దండలు...?

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments