Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఎస్‌లో కుమ్మేసిన "ఖైదీ"... తన చిత్రాల రికార్డును చెరిపేసుకున్న బాలకృష్ణ... ఆ చిత్రం రికార్డు సేఫ్..

ఈ సంక్రాంతికి వచ్చిన ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి రికార్డును టచ్ చేయలేక పోయాయి. ఫలితంగా అమెరికాలా బాహుబలి రికార్డు స్థిరంగా ఉంది. అయితే, మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (09:44 IST)
ఈ సంక్రాంతికి వచ్చిన ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి రికార్డును టచ్ చేయలేక పోయాయి. ఫలితంగా అమెరికాలా బాహుబలి రికార్డు స్థిరంగా ఉంది. అయితే, మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రం మాత్రం బాహుబలి రికార్డుకు కేవలం 100 డాలర్ల దూరంలో నిలిచిపోయింది. కానీ, బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం మాత్రం ఈ రెండు చిత్రాల దరిదాపుల్లోకి రాకపోవడం గమనార్హం.
 
బాలకృష్ణ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం అమెరికాలో ఆయన పాత చిత్రాల తొలి రోజు కలెక్షన్ రికార్డులను తిరగరాసింది. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం తొలిరోజున 45 వేల డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
అయితే, చిత్రం సూపర్ హిట్టన్న టాక్ రావడంతో మరిన్ని థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి పోటీలో ఉన్న చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' యూఎస్‌లో 1.25 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో "బాహుబలి" రికార్డు పదిలంగా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments