చెంప దెబ్బకొట్టి తగ్గేదేలే.. అనడం ఎంత వరకు సమంజసం: గరికపాటి

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:47 IST)
హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్‌‌లను గరికపాటి ఏకిపారేశారు. ఆ ఇద్దరూ తన దగ్గరకు వస్తే… కడిగి పారేస్తానని నిప్పులు చెరిగారు. స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా పుష్ప సినిమా వుందని ఫైర్ అయ్యారు. దీన్ని చూసి సమాజంలో మనుషులు చెడిపోతే.. ఎవరిది బాధ్యత అంటూ నిలదీశారు. ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారని ఫైర్‌ అయ్యారు గరికపాటి. 
 
స్మగ్లింగ్‌‌ను, రౌడీయిజాన్ని ప్రోత్సహించడం.. రోడ్డు మీద పోయేవాళ్లను చెంప దెబ్బకొట్టి తగ్గేదేలే.. అనడం ఎంత వరకు సమంజసమని గరికపాటి ప్రశ్నించారు. రాముడు, హరిశ్చంద్రుడు లాంటి వారు అలాంటి డైలాగులు వాడాలి కానీ.. స్మగ్లర్లు ఎలా వాడుతారని.. అలాంటి వారిని ప్రోత్సహిస్తూ అసలు సినిమాలు ఎలా తీస్తారని గరికపాటి తీవ్రంగా మండిపడ్డారు. 
 
పుష్పరాజ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని గరికపాటి తెలిపారు. సత్కారాల కోసం ప్రవచనాలు చేయనన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాహిత్యం, విద్య విభాగం నుంచి పద్మ శ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments