Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్నా మోము గోదారోళ్లం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం'...

Webdunia
సోమవారం, 31 జులై 2023 (14:54 IST)
విష్వక్‌సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం... కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. టైటిల్‌ను బట్టే ఈ సినిమా గోదావరి నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమైపోతోంది. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, గోదావరి కేంద్రంగా సాగే ఇసుక మాఫియా చుట్టూ ఈ కథ నడవనుందని తెలుస్తోంది.
 
మాఫియా.. ఈ విషయంలో ముఠాల మధ్య గొడవలు ప్రధానంగా ఈ కథ కొనసాగుతుందని అనిపిస్తోంది. "అన్నా మేము గోదారోళ్లం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం' అంటూ విష్వక్ చెప్పిన డైలాగ్‌తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. లవ్.. యాక్షన్.. సస్పెన్స్ ప్రధానంగా ఈ గ్లింప్స్ కనిపించింది. 
 
ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా.. డైలాగ్ డెలివరీపరంగా మాత్రమే మాస్‌గా కనిపించిన విష్వక్‌సేన్, ఈ సినిమాలో మాస్‌లుక్‌తోనే కనిపిస్తున్నాడు. కథానాయికగా నేహాశెట్టి నటించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ .. సాయికుమార్, గోపరాజు రమణ కనిపించారు. అంజలి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments