సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ముందుగా కొన్ని ప్రాంతాలలో ఇప్పటి ట్రెండ్‌కు ప్రివ్యూ ప్రదర్శించారు. అన్నిచోట్ల కిరాక్ పుట్టించేలా వుందని యువత మెచ్చుకోవడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ వివరాలను తెలియజేస్తూ గురువారం సాయంత్రం రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, గంధర్వ చిత్రాన్ని 2021లో షూట్ మొదలు పెట్టాం. అప్పటినుంచి జర్నీ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సెన్సార్ ముగించుకుని జూలై 8న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. గంధర్వ అనేది యూనిట్ పాయింట్. ఇంతవరకు ఎక్కడా రాని పాయింట్. ఇందులో అవసరం మేరకు సీనియర్ నటులు పోసాని, బాబూమోహన్ వంటివారు నటించారు. ఈ కథతో ఆరేళ్ళుగా జర్నీచేసుకుంటూ క్లయిమాక్స్ ఎలా తీయాలని ఆలోచించాం. సైన్స్ పరంగా ఇజ్రాయిల్‌లో జరిగిన ఓ రీసెర్చ్‌ను పట్టుకుని ఇందులో యాడ్ చేశాం. క్లయిమాక్స్ అందరినీ మెప్పించేలా చేశాం. సందీప్ కథ విన్నాక చాలా ఎగ్జయిట్‌మెంట్ అయ్యారు. మా టీమ్‌తో కూర్చుని ఏ సీన్ ఎలా చేయాలో అన్నీ క్షుణ్ణంగా చర్చించారు. నేను కథను సందీప్ కోసం రాసుకోలేదు. కథే ఆయన దగ్గరకు వెళ్ళింది. టెక్నికల్‌గా కెమెరా జవహర్ రెడ్డి, ఎడిటర్ బసవపైడిరెడ్డి పనిచేశారు. ఫస్ట్ కాపీ చూశాక సురేష్‌కొండేటిగారు నేను ఈ సినిమాను విడుదల చేస్తానని అనడం మాకు మొదటి విజయంగా భావించాం. అలాగే ప్రమోషన్‌లో భాగంగా పలుచోట్లకు వెళ్ళాం. ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌లలో ప్రివ్యూ వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఏర్పడింది. ఇందులో గాయత్రీ ఆర్. సురేష్, శీతల్ భట్ పోటాపోటీగా నటించారు. కొన్ని యాక్షన్ సీన్స్‌లో మమ్మల్ని హీరో భయపెట్టాడు. లఢాక్‌లో మైనస్ డిగ్రీ వాతావరణం వుండగా కొండపైకి వెళ్ళి రిస్కీ షాట్ చేశారు. సహజానికి దగ్గరగా వుండాలనే తపన ఆయనలో కనిపించింది. ఆ తపన మాకు భయమేసేది. ఒక్కోసారి బెటర్‌మెంట్ కోసం ఇంకోసారి చేయమంటారా అని అడిగేవాడు. 24 క్రాఫ్ట్‌ల కెరీర్ ఈ సినిమాలో వుంది. అందరి శ్రేయస్సు కోరే సందీప్, వంగవీటి, జార్జిరెడ్డి వంటి చిత్రాల్లో వైవిధ్యంగా నటిస్తూ పాత్రే కనిపించేలా చేశాడు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు కాబట్టి ఆయన ఈ పాత్రకు బాగా సూటయ్యాడు. గంధర్వలో పాత్ర పరంగా ఆయనకు మంచి పేరు వస్తుంది. సురేష్ కొండేటిగారు పంపిణీదారుడిగా, నిర్మాతగా వున్న అనుభవంతో మా సినిమా చేయడం మాకు మరింత నమ్మకాన్ని పెంచింది. షకీల్ సంగీతం బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు. ఆర్.ఆర్. బాగా సరిపోయింది. ఆయనకు మంచి భవిష్యత్ వుంటుంది. జూలై8న సినిమాను చూసి ఆనందించండి అని చెప్పారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ, టైటిల్‌ల్లోనే కొత్తదనం వుంది. క్యూరియాసిటీతో కథ మొదలవుతుంది. థ్రిల్లర్ ఫీల్‌ను ఫ్యామిలీ డ్రామా చొప్పించి కామెడీ, యాక్షన్ అంశాలన్నీ మిళితం కావడంతో చూసిన వారికి బాగా నచ్చుతుంది. మా సినిమాకు సురేష్ కొండేటిగారు మొదటి ప్రేక్షకుడు. ఆయనకు నచ్చి సినిమా తీసుకున్నారు. అది మాకు చాలా ప్లస్ అయింది. దర్శకుడు అప్సర్ కథను చాలా కాలంగా రాసుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ కావడంతో కథ చాలా కొత్తగా ఫీలవుతారు. జూలై 8న సినిమా చూసి ఆనందించండి అని తెలిపారు.
ఎస్.కె. ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, మా ఎస్.కె. ఫిలింస్ ద్వారా పాండమిక్ తర్వాత విడుదల చేస్తున్న చిత్రమిది. సినిమా చూశాక బాగా నచ్చి విడుదల చేస్తున్నాను. ప్రేక్షకులు మా బేనర్‌లో మంచి సినిమాలను ఆదరించారు. అందుకే ఇప్పటి ట్రెండ్‌కు ఎలా వుంటుందనే ఆలోచనతో ఇటీవలే షోలు వేశాం. వారి స్పందన చాలా అద్భుతంగా వుంది. దాంతో సినిమాపై మాకు ఫుల్ నమ్మకం వచ్చేసింది. మరో బ్లాక్ బస్టర్‌ను మా బేనర్‌లో అందించనున్న దర్శక ధీరుడు అప్సర్ అనొచ్చు. జర్నలిస్టుగా నా 31 ఏళ్ళ అనుభవంతో చూడని కథ గంధర్వ. ఇండియన్ సినిమాలో ఇంతవరకు రాని పాయింట్. సందీప్‌కు వంగవీటి, జార్జిరెడ్డి తర్వాత ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ఫోటోగ్రపీ, సంగీతం, హీరోయిన్ల అభినయం చాలా బాగా కుదిరాయి. పోసాని కృష్ణ మురళి సీన్స్ యూత్‌కు బాగా పండుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా పండుగే పండుగ. ఈ సినిమాను నాకివ్వాలని ఆలోచన కలిగిన దర్శక నిర్మాతలను థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను చూపించి అమ్మవచ్చు అనే ధైర్యంతో చూపించాం. నా గత చిత్రాలు ప్రేమిస్తే, జర్నీలాగా కంటెంట్‌ను నమ్మాను. ఈ సినిమాకూడా అలాగే చేశాను. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జూలై8న థియేటర్‌లోనే చూడండి. ఆ అనుభవం వేరేగా వుంటుంది అని చెప్పారు.