Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ సర్దార్ మూవీని క్యాన్సిల్ చేస్తాడా? సెంటిమెంట్ వర్కౌట్ కాలేదా?

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (14:23 IST)
పవన్ కల్యాణ్‌కు సర్దార్ గబ్బర్ సింగ్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గబ్బర్ సింగ్ ఎంత పేరు తెచ్చిపెట్టిందో.. సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం చాలా టెన్షన్ తెచ్చిపెడుతుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమైందో, అప్పటి నుంచి పవన్ కల్యాణ్ జీవితం డిస్ట్రబ్‌గానే ఉందనే సెంటిమెంట్ పవన్‌ను వేధిస్తోందట. 
 
ఒకవైపు ప్రజా సమస్యలు ఆయనను నిత్యం ప్రేరేపిస్తూనే ఉంటే, మరోవైపు ఏ ఒక్క సినిమాకు సంబంధించి పని ఓ కొలిక్కి రావట్లేదు. ఈ రెండు రకాల పనుల్ని నియంత్రించుకోవడం పవన్ వల్ల కాలేదట. అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలసింది. ఇంకా చెప్పాలంటే అస్సలు సినిమాలకు బై చెప్పేస్తే ఇంకా ఎంత బాగుంటుందనే ఆలోచనలోనూ పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కానీ, ఇప్పటికే మాట ఇవ్వడంతో సైన్ చేసిన సినిమాలను పూర్తిచేయాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే సర్ధార్ గబ్బర్ సింగ్‌ని కంప్లీట్ చేసి మూవీలకు గుడ్ బై చేప్పే ఆలోచనలలో ఉన్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. ప్రజల కోసం ఆలోచిస్తున్నందు వారి సమస్యల పరిష్కారం కోసమే పవన్ పరితపిస్తున్నాడని వారు చెప్తున్నారు. 
 
సినిమా కంటే ప్రజా సమస్యలే ఆయన్ని చాలా డిస్ట్రబ్ చేస్తున్నాయని సన్నిహిత వర్గాల సమాచారం. మరీ అదే నిజమైతే పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ప్రవేశించే ఛాన్సుందని.. ఆయన చెప్పుకున్నట్లు పాలిటిక్స్‌కు వచ్చేందుకు టైమ్ వచ్చేసిందన్నమాట.!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments