Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GaaliVaaluga : 'అజ్ఞాతవాసి' ప్రమోషనల్ సాంగ్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొనివున్నాయి.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (10:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొనివున్నాయి.
 
ఎందుకంటే 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత మళ్ళీ త్రివిక్రమ్, పవన్ కాంబో రానుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై లెక్కకిమించిన ఊహాగానాలు చేస్తున్నారు. అదేసమయంలో 'అజ్ఞాతవాసి' చిత్రానికి భారీగా కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా 'గాలివాలుగా' అనే ప్రమోషనల్ సాంగ్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చారు. మరి ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
 
కాగా, మంగళవారం 'గాలి వాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ..' అంటూ సాగిపోతున్న ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అనిరుద్ రవిచందర్ ఆలపించారు. 4 నిమిషాల 18 సెకనుల నిడివితో అనిరుద్ రవిచందర్ అందించిన లిరిక్స్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది. భారీ అంచనాల నడుమ 'అజ్ఞాతవాసి' జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
 
కాగా, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పటికే 'బయటకొచ్చి చూస్తే టైమేమో..' అనే మొదటి పాటను రిలీజ్ చేయగా, ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా సినిమాలోని రెండో పాటను కూడా విడుదల చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments