Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ రీపీట్ కానున్న సిసింద్రీ కాంబినేషన్..? అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అదుర్స్

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (12:03 IST)
Akhil_Nagarjuna
సిసింద్రీ సినిమా గురించి అందరికీ బాగా తెలుసు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అఖిల్ నటించిన సినిమా ఇది. వీరిద్దరీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్టైన సంగతి తెలిసిందే. నాగ్ - అఖిల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది.
 
ఈ క్రేజీ మల్టీస్టారర్‌కి డైరెక్టర్ ఎవరంటే... వరుస విజయాలు సాధిస్తున్న సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని సమాచారం. నాగ్-అఖిల్ వీరిద్దరికీ కరెక్ట్‌గా సెట్ అయ్యే స్టోరీ రెడీ చేసాడట. ఇటీవల నాగ్‌ని కలిసి స్టోరీ వినిపించాడని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు ఈ ప్రాజెక్ట్ సెట్ అయి త్వరగా సెట్స్ పైకి వెళ్లాలి అని కోరుకుంటున్నారు.  
 
ఇప్పటికే టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హిమాలయాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ విభిన్న కథా చిత్రంలో నటించనున్నారు. 
 
అలాగే బంగార్రాజు సినిమా కూడా షూటింగ్‌కి రెడీ అవుతుంది. ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి స్లాన్ చేస్తున్నారు. 
 
ఈ సినిమా తర్వాత స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments