Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిదా పడ్డ రామ్ గోపాల్ వర్మ శారీ నుండి ఎగిరే గువ్వలాగా.. సాంగ్ రిలీజ్

డీవీ
శుక్రవారం, 31 జనవరి 2025 (16:39 IST)
Satya Yadu, Aaradhya Devi
రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ  'శారీ' లాగ్ లైన్: 'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ'.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త  రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు.  తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా  పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' మూవీ రూపొందుతోంది. ఈ రోజు RGV డెన్ లో 'శారీ' చిత్రానికి సంబందించిన సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ 'ఎగిరే గువ్వలాగా...' విడుదల చేసారు.
 
ఈ రోజు  'ఆర్జీవీ డెన్ మ్యూజిక్' నుంచి  సెకండ్ లిరికల్ సాంగ్ 'ఎగిరే గువ్వలాగా...' రిలీజ్ చేసామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ పాట రాకేష్ పనికెళ్ళ ట్యూన్ చేసి లిరిక్ కూడా అతనే ఇచ్చాడని, పాటలో సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఈ పాటను సింగర్ సాయి చరణ్ పాడారని ఆయన తెలిపారు.
 
నిర్మాత రవి శంకర్ వర్మ మాట్లాడుతూ  "మా 'శారీ' చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ఇటివల విడుదల చేసిన 'ఐ వాంట్ లవ్' కి విశేష స్పందన లభించింది. ఈ రోజు సెకండ్ లిరికల్ సాంగ్  'ఎగిరే గువ్వలాగా...' రిలీజ్ చేసాము.  ఇంకా  హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో కూడా ఈ రోజే  ఈ  సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేసాము. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయ్, కొన్ని అనివార్య కారణాల వలన విడుదల ఆలస్యం అయింది త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తాము" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments