Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతిజింటాకు ముద్దుపెట్టిన రితేశ్.. ఈగోకు గురైన జెనిలీయా (Video)

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (16:11 IST)
Ritish deshmukh
స్టార్ హీరోయిన్ జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంటోంది. తన భర్త, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌తో కలిసి హాయిగా జీవనం సాగిస్తోంది. తాజాగా జెనీలియా తన భర్త ప్రవర్తన పట్ల ఈర్ష్య చెందింది. సాధారణంగా తన భర్త తన కళ్ల ముందే మరో మహిళకు కిస్ ఇస్తే ఈర్ష్యపడని ఆడవాళ్లు ప్రపంచంలో ఎవరూ ఉండరు. దీనికి సినిమా స్టార్లయినా అతీతం కాదు. 
 
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచిన జెనీలియా డిసౌజా కూడా అలానే ఈర్ష్యపడింది. తన భర్త రితేస్ దేశ్‌ముఖ్ తన ముందే బాలీవుడ్ నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టాడు. ఇది చూసి ఆమె తెగ జెలస్‌గా ఫీలైంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రితేష్‌ను జెనీలియా ఓ ఆటాడుకుంది. 
 
రితేష్.. ప్రీతికి కిస్ ఇవ్వడం వరకూ నిజమే కానీ.. జెనీలియా ఈర్ష్యపడటం, తర్వాత ఇంటికి వచ్చి రితేష్‌ను కొట్టడం మాత్రం ఉత్తదే. జెనీలియానే సరదాగా ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో షేర్ చేసింది. నిజానికి ఎప్పుడో 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా ప్రీతికి రితేష్ కిస్ ఇచ్చిన వీడియోను జెనీలియా ఇప్పుడిలా ఫన్నీగా తయారు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments