Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ మృతి..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:46 IST)
shravan Rathod
కరోనా మహమ్మారి బాలీవుడ్‌లో మరో ప్రముఖుడిని బలితీసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు. మరో సంగీత దర్శకుడు నదీమ్‌తో కలిసి శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చేవారు. నదీమ్-శ్రావణ్ జంటగా బాలీవుడ్‌లో ఈ ద్వయం చిరపరిచితం. సూపర్ డూపర్ హిట్ చిత్రాలైన సాజన్, పరదేశ్, రాజా హిందూస్థానీ వంటి అనేక చిత్రాలకు వీరే సంగీతాన్ని అందించారు. 
 
ఇటీవల ఆయనకు కరోనా సంక్రమించింది. ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత రాత్రి 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు.
 
ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు. శ్రావణ్ కుమారులైన సంజీవ్, దర్శన్ కూడా సంగీత దర్శకులుగానే స్థిరపడ్డారు. శ్రావణ్ మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని గాయకుడు అద్నాన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments