Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతి రత్నాలు లాంటి వినోదంతో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో - అనుదీప్ కెవి

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (16:04 IST)
Anudeep KV,
 ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతి రత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
 మీరు నవ్వరు కానీ జనాల్ని నవ్విస్తారు.. ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పండి ?
నేనూ నవ్వుతాను. అయితే నవ్వినపుడు కెమరాలు వుండవు. (సరదాగా)
 
`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` ఆలోచన ఎలా మొదలైయింది ?
ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం.
 
ఈ కథ మీ జీవితానికి దగ్గర వుంటుందా ?
చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.
 
`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూసిన  అనుభవాలు ఉన్నాయా ?
`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే వుండదు. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం.
 
జాతి రత్నాలు తర్వాత ఇంకా పెద్ద సినిమా ఆలోచన చేయాలి కదా.. మరి కొత్తవారితో ఈ సినిమా చేయడం వెనుక లెక్క ఏమిటి ?
నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది.
 
శ్రీకాంత్ ని ఎలా ఎంపిక చేశారు ? శ్రీకాంత్ మీకు స్నేహితుడని చెప్పారు.
శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది.
 
 `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`తో మరో జాతిరత్నాలని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవచ్చా ?
తప్పకుండా. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ వుంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే వుంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా వున్నారు.
 
పబ్లిక్ ఫెమిలియర్ కాస్ట్ వుంటే ఇంకా హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా ?
ఈ కథలో పబ్లిక్ ఫెమిలియర్ కాస్ట్ తో ఒక సమస్య వుంది. అందరికీ తెలిసన నటుడు ఉన్నారనుకోండి. అతడికి సినిమా టికెట్ దొరకదని చూపించడం అంత సహజంగా వుండదు. అదే కొత్త నటుడు అయితే ఇది మరింత ఆర్గానిక్ గా వుంటుంది.
 
శివకార్తికేయన్ సినిమాతో బిజీగా వుండటం వలన ఈ సినిమాకి దర్శకత్వం చేయలేదా ? మరే ఇతర కారణాలు ఉన్నాయా ?
మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ వుంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు వుంటే బావుందని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ వుంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా భాద్యత వుంటుంది.
 
సినిమా టికెట్ గురించి ప్రయత్నించడం చిన్న లైన్ కదా.. దిన్ని రెండు గంటల సినిమాగా మార్చడం ఒక సవాల్ కదా ?
నిజమే. రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో వుంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో వున్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను.
 
ఖుషి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`  చూశారా ?
`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` టికెట్లు దొరకలేదు. నారాయణ్ ఖేడ్ లో మాట్నీ షో చూశా. నేను పుట్టి పెరిగిన ప్రాంతాలు, చుసిన ప్రదేశాలు గురించి సులువుగా రాయగలుగుతానని భావిస్తాను. ఈ సినిమాలో చిత్రీకరించిన  థియేటర్ హైదరాబాద్ లోని మణికంఠ. 
 
కామెడీ విషయంలో మీ స్ఫూర్తి ?
ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువుంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుండి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా వున్న కథలు కూడా రాయాలని వుంది.
 
 అల్లు అరవింద్ గారు, వెన్నెల కిషోర్ లతో చేసిన ఫన్నీ ప్రమోషన్స్ ఆలోచన మీదేనా ?
అవును. అయితే అల్లు అరవింద్ గారి ఇంటర్వ్యూ అంత ఫన్నీ గా వస్తుందని అనుకోలేదు. ఆయన పెద్ద మనసుతో చాలా గొప్పగా సహకరించారు. ప్రమోషన్స్ విషయంలో వంశీ, శ్రీజగారి ఆలోచనలు కూడా వుంటాయి.
 
వంశీ, లక్ష్మీ నారాయణల గురించి చెప్పండి ?
హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు వుంటాయి. సినిమా అంటే క్రేజీ వుండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నాకు ఎప్పటినుండో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ వుంది.
 
జాతి రత్నాలు తర్వాత జీవితం ఎలా వుంది ?
మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి కొంచెం అలానే చూశారు. జాతిరత్నాలు హిట్ కాబట్టి హిట్ డైరెక్టర్ గా చూశారు.  అయితే జాతిరత్నాలు తర్వాత జీవితంలో అన్నీ చూసిన ఫీలింగ్.
 
నాగ్ అశ్విన్ తో కథలు గురించి మాట్లాడుతుంటారా ?
లేదండీ. ఆయన చాలా బిజీ. కలిసినప్పుడు కథలు గురించి మాట్లడుకోము. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం.
 
శివకార్తికేయన్ గారితో చేస్తున్న ప్రిన్స్ గురించి ?
పాండిచ్చేరి నేపధ్యంలో సాగే కథ అది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళి రిలీజ్ వుంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా వుంటుంది.
 
జాతి రత్నాలు 2 ఎప్పుడు ?
కొన్ని ఐడియాలు వున్నాయి. రెండు మూడేళ్ళ తర్వాత చేయాలి.
 
కొత్త ప్రాజెక్ట్స్ ?
వెంకటేష్ గారికి కథ చెప్పాలి. ఇంకొన్ని ఆలోచనలు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments