Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు!!

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (10:39 IST)
వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబై పోలీసులు దేశ ద్రోహం కేసును నమోదు చేశారు. కంగనా సోదరి రంగోలిపై కూడా కేసు నమోదు చేశారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ అలీ సయ్యద్ ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసింది. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చింది. దీంతో మహారాష్ట్ర అధికార పార్టీకి చెందిన శివసేనకు ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ కాస్టింగ్‌ డైరెక్టర్, ఫిట్‌నెట్‌ ట్రైనర్‌ మునావర్‌ అలీ సయ్యద్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్‌ అలీ సయ్యద్‌ బాంద్రా కోర్టును ఆశ్రయించారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్‌ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్‌ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments