Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా భగవాన్ కరే లాంటి చిత్రాలు మరెన్నో రావాలి- అతిధుల ఆకాంక్ష

Webdunia
సోమవారం, 16 మే 2022 (17:39 IST)
Lata Bhagwan Kare, Naveen Deshaboina, Errabothu Krishna, MLA Subhash Reddy, Dr. Kancharla Chandrasekhar Reddy,
65 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ లతా కారే తన భర్త ఆరోగ్యం క్షీణించినప్పుడు తనను బ్రతికించుకోవడంకోసం ఎస్ కె మారథాన్ పరుగు పందెంలో గెలిచి తన భర్తను ఎలా కాపాడుకుంది అనే రియలిస్టిక్  కథాంశంతో  "లతా భగవాన్ కరే" చిత్రం రూపొందింది. 
 
పరంజ్యోతి ఫిలిం క్రియేషన్ పతాకంపై నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కృష్ణ మరాఠీలో ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ లతా భగవాన్ కరే చిత్రం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుకొని 67వ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకొంది. అలాగే నార్త్ లో ఒక తెలుగు డైరెక్టర్ కి  ది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నవీన్ దేశబోయినకు ఫిలిం ఫేర్ అవార్డు రావడం ఇదే తొలిసారి.. అనే చెప్పాలి.
 
అంతే కాకుండా 70 దేశాలకు పైగా ఈ చిత్రం గురించి నేషనల్ మీడియా అంతా  కూడా పబ్లిసిటీ చేసి ప్రమోట్ చేసింది. ప్రత్యేకంగా  మరాఠీ గవర్నమెంట్ ఈ కథను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని ఆర్థర్ పాస్ చేసింది.. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించింది మన తెలుగు దర్శక, నిర్మాతలే కావడం గొప్ప విశేషం.. ఇంతటి రస్టిక్ రా కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో  రూపొందించాలని దర్శకుడు నవీన్, నిర్మాత కృష్ణ ప్లాన్  చేస్తున్నారు. ఈ సందర్బంగా మే 16న హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్ యల్ ఎ సుభాష్ రెడ్డి, ప్రముఖ రాజకీయ వేత్త డా. కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి, దర్శకుడు నవీన్ దేశబోయిన, చిత్రంలో లో ప్రధాన పాత్ర పోషించిన లతా భగవాన్ కరే, సునీల్ కరే తదితరులు వేదికపై ఆశీనులవగా చిత్ర నిర్మాత కృష్ణ ఎర్రబోతు శాలువాలతో సత్కరించించి ప్లవర్ బొకేలతో ఘన స్వాగతం పలికారు.. అనంతరం లతా భగవాన్ కరే ప్రోమోస్ ని ప్రదర్శించారు. 
 
ముఖ్య అతిధిగా విచ్చేసిన యం.యల్.ఏ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. " ఒక 65 సంవత్సరాల వృద్ధ మహిళా తన భర్తను కాపాడుకోవడం కోసం పరుగు పందెంలో పాల్గొంటుంది. వయసున్న వారితో పోటీ పడి గెలిచి దాంతో వచ్చిన డబ్భుతో తన భర్తను బ్రతికించుకుంటుంది. ఇలాంటి సినిమాలు యువతకు ఆదర్శవంతం కావాలి. రియల్ ఇన్సిడెంట్స్ తో ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొంధించిన దర్శకుడు నవీన్, నిర్మాత కృష్ణను అభినందిస్తున్నాను.. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి.. ప్రత్యేకించి ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి.. మన తెలుగు వాళ్ళు తీసిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం. ఎంతో టాలెంట్ వున్న దర్శకుడు నవీన్.. అలాగే మంచి చిత్రాలు నిర్మించాలి అనే ప్యాషన్తో వున్నా కృష్ణ ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు కావాలి అన్నారు. 
 
డా. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. లతా భగవాన్ కరే లాంటి సందేశాత్మక చిత్రాలు యువతకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయి. ఒక 65ఏళ్ళ మహిళ ఎంతో కష్టపడి తన భర్తను ఎలా బ్రతికించుకుంది.. అనే పాయింట్ తో నవీన్ ఈ చిత్రాన్ని రూపొంచాడు. మన తెలుగు వాళ్ళు తీసిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో హ్యాపీగా వుంది. ఇంతటి చక్కని మెస్సేజ్ తో సినిమా నిర్మించిన కృష్ణ, దర్శకుడు నవీన్ ను అభినందిస్తున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా విద్య వైద్యానికి పెద్ద పీట వేస్తూ అందరికి మంచి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన భాద్యత ఎంతైనా ఉంది.. అన్నారు. 
 
నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఇండియన్ పనోరమకి మన తెలుగు చిత్రాలు ఎంపిక కాకపోవడం దురదృష్టకరం. అయినా కూడా ఇప్పుడు మన తెలుగు దర్శకుడు నవీన్, నిర్మాత కృష్ణ మరాఠి లో సినిమా తీసి 67వ  జాతీయ అవార్డు సంపాదించుకోవడం చాలా  గొప్ప విషయం. నాకు చాలా ఆనందంగా వుంది. ఒకప్పుడు పగిడి జయరాజ్ ట్రాన్స్ పోర్ట్ ఏమి లేని టైమ్ లో బొంబయి వెళ్లి సినిమాలు తీశారు.. అలాగే మన ఎల్వీ ప్రసాద్ గారు కూడా హిందీలో సినిమాలు చేసి గొప్ప పేరు సంపాదించుకున్నారు. మరాఠి, తమిళ్, మలయాళం, సినిమాలే ఎక్కువగా ఇండియన్ పనోరమకు పోటీ పడుతుంటాయి. అలాంటిది మన తెలుగు వాళ్ళు తీసిన మరాఠి ఫిలింకి అవార్డు రావడం గొప్ప విషయం. ఇలాంటి చిత్రాలు మన తెలుగులో కూడా తీసి మరెన్నో అవార్డులు సంపాదించాలి.. ఇలాంటి చిత్రాలకి  టికెట్స్ రేట్స్ తగ్గించి సామాన్య ప్రేక్షకులు చూసేలా  ముల్టీ ప్లెక్స్ లలో కూడా ఆడాలి అని రాజ్ ఠాక్రే ఆదేశించారు. అలాగే మన ప్రభుత్వాలు కూడా చేయాలి.. చేస్తే చాలా బాగుంటుంది. చిన్న సినిమా బ్రతుకుతుంది అన్నారు. 
 
చిత్ర దర్శకుడు నవీన్ మాట్లాడుతూ.. లతా భగవాన్ కారే జీవితంలో జరిగిన కథ ఇది. ఇందులో అందరూ నిజ జీవిత పాత్రలే పోషించారు. ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. నా మొదటి చిత్రానికే  ఉత్తమ ఫిలిం  67వ నేషనల్ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే డెబ్యూ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు రావడం ఇంకా ఆనందంగా వుంది. నేషనల్ మీడియా అంతా కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసి పబ్లిసిటీ చేశాయి.. అలాగే మన తెలుగు వారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఇదే బ్యానర్ లో లతా భగవాన్ కారే చిత్రాన్ని రీమేక్ చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తాం.. అలాగే ఇంకో వినూత్నమైన సబ్జెక్టు తో ఒక సినిమా చేస్తున్నాం.. అది త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ చేస్తాం.. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత కృష్ణ గారికి నా థాంక్స్ అన్నారు. 
 
చిత్ర నిర్మాత ఎర్రబోతు కృష్ణ మాట్లాడుతూ.. నవీన్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాను. లతా భగవాన్ కారే జీవితంలో జరిగిన కథతోనే ఆమెనే పెట్టి ఈ సినిమా తీయడం జరిగింది. మా ఫస్ట్ సినిమాకే 67వ జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి అవార్డు రావడం చాలా సంతోషంగా వుంది.. అందరికీ  రీచ్ అయ్యే కంటెంట్ ఇది. అందుకే పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాం. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సేమ్ ఆర్టిస్టులతో సినిమా చేయబోతున్నాం. త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ చేసి షూటింగ్ ప్రారంభిస్తాం.. అన్నారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments