Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుప‌తిలో ఫిలింఛాంబ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ - మూవీ ట‌వ‌ర్స్ 2కు ఏర్పాట్లు

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:29 IST)
Producers at Tirupati
ఆంధ్ర‌లో కూడా తెలుగు చ‌ల‌న చిత్ర రంగాన్ని అభివృద్ధి చేయ‌డానికి కృషి చేస్తున్నామ‌నీ, అదేవిధంగా హైద‌రాబాద్ కోకాపేట‌లో మూవీ ట‌వ‌ర్స్ 1 ను శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని ద‌య‌వ‌ల్ల ఎటువంటి ఆటంకం లేకుండా క‌ట్టాం- అని తెలుగు నిర్మాతలు మండలి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రసన్నకుమార్ తిరుప‌తిలో తెలియ‌జేశారు.
 
బుధ‌వారంనాడు తెలుగు నిర్మాతలు మండలి స‌భ్యులు తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్నారు. వీరిలో కళ్యాణ్, ప్రసన్నకుమార్. మోహన్ వడ్లపట్ల, రామ సత్యనారాయణ, మోహన్ గౌడ్ లున్నారు.
 
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఇటీవ‌ల సి.ఎం. జ‌గ‌న్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. అందుకే తిరుప‌తిలో వున్న ఛాంబ‌ర్ బిల్డింగ్‌ల‌ను మ‌రింత అభివృద్ధి చేయాల‌నుకుని ఈరోజు చూశాం. అదేవిధంగా హైద‌రాబాద్ కోకాపేట‌లో   మూవీ టవర్స్ 1 క‌ట్టి నిర్మాత‌లు ఒకేచోట వుండేలా చ‌ర్య‌లు తీసుకున్నాం. ఆ స్పూర్తితో మూవీ టవర్స్ 2 ఏర్పాటు చేయ‌నున్నాం. ఇది మా నిర్మాతలు కి తీరని కల గా మిగిలి పోకుండా నెరవేర్చెటం కోసం మా ప్రయత్నంలో త్వరలో నిజం కానుంది అన్నారు.
 
రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. తిరుపతి లో మా నిర్మాత ల మండలి..తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్..ఆఫీసులు గెస్ట్ హౌస్ లు ఉన్నాయి..వాటిని చూడటానికి వచ్చాము.. త్వరలో మూవీ టవర్స్ 2 ఎర్పాటు చేయటం కోసం శ్రీ కారం చుట్టనున్నామ‌ని తెలిపారు.
 
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతు.. చదలవాడ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ మూవీ టవర్స్ 2...ని ఏర్పాటు చేసి 500 మంది నిర్మాతల కలలు కి సాకారం జరుగుతుంది.. మళ్ళీ వెంకటేశ్వర స్వామి దయ తో ఈ కార్యక్రమం ముందుకు వెళుతోంద‌న్నారు.
 
మోహన్ గౌడ్ మాట్లాడుతూ..చిన్న నిర్మాతల కోరిక మూవీ టవర్స్ 2..నిర్మించాలి అని..అది..మా  హయం లో  పెద్దలు చదలవాడ గారి సహకారం తో..ముందుకు వెల్లుతున్నాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments