Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్సీస్‌లో 'ఫిదా' కలెక్షన్ల వర్షం.. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది 'వెనక్కి..

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోం

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (15:52 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా హైయ్యెస్ట్ గ్రాసింగ్ టాప్-10 జాబితాలో "ఫిదా" చేరిపోయింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" వంటి చిత్రాలను వెనక్కినెట్టేయడం గమనార్హం. 
 
మూడో వీకెండ్‌ వచ్చేసరికి 1.97 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఫిదా.. లాంగ్‌రన్‌లో కనీసం 2.3 మిలియన్ డాలర్లను దాటగలదని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ధాటికి ఓవర్సీస్‌లో టాప్-10 లిస్ట్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఏడో స్థానానికి చేరకున్న ఫిదా.. ఎట్టకేలకు టాప్-6 ప్లేస్‌లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఓవర్సీస్‌లో టాప్-10 లెక్కలను ఫిదా మార్చేసింది. ఆ టాప్-10 సినిమాలేవో ఓ లుక్కేయండి. 
 
ప్రస్తుతం ఓవర్సీస్ కలెక్షన్లలో 20.47 మిలియన్ డాలర్లు కలెక్షన్లతో 'బాహుబలి-2' చిత్రం మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 7.51 మిలియన్ డాలర్లు కలెక్షన్లతో 'బాహుబలి-1' చిత్రం, 2.89 మిలియన్ డాలర్లతో 'శ్రీమంతుడు' చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 'అ.. ఆ...' (2.45 మిలియన్ డాలర్లు), 'ఖైదీ నెం.150' (2.45 మిలియన్ డాలర్లు), 'నాన్నకు ప్రేమతో' (2.02 మిలియన్ డాలర్లు), 'ఫిదా' (1.97 మిలియన్ డాలర్లు), 'అత్తారింటికి దారేది' (1.90 మిలియన్ డాలర్లు), 'జనతాగ్యారేజ్' (1.80 మిలియన్ డాలర్లు), 'గౌతమీపుత్ర శాతకర్ణి' (1.66 మిలియన్ డాలర్లు) చిత్రాలు ఉన్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments