Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీగా నవ్వుకునేలా అనుభవించు రాజా- ఉంటుంది - సుప్రియ యార్ల‌గ‌డ్డ‌

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:26 IST)
Raj Tarun, Supriya, Sunil Narang and others
రాజ్ తరుణ్ ప్రస్తుతం శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ `అనుభవించు రాజా` సినిమాలో న‌టిస్తున్నారు .ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోన్న అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సునిల్ నారంగ్ పాల్గొన్నారు.
 
నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ‌ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. చిన్న సినిమా అనేది ఇండస్ట్రీని కాపాడుతుంది. ఆ చిన్న సినిమాను ఎలా కాపాడుకోవాలనేది ఎవ్వరికీ తెలియడం లేదు. రెండేళ్ల క్రితం దర్శకుడు కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. అందరూ చెబుతుంటారు కదా? అని అనుకున్నాం కానీ తొమ్మిది నెలలు తిరిగాడు. ఇక అప్పుడు ఫిక్స్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. అయితే చిన్న సినిమాను ఎలా తీయాలని నేను అనుకున్నాను. రాజ్ తరుణ్‌తో `ఉయ్యాలా జంపాల` సినిమా తీసినప్పుడు ఎంతో సంతృప్తి చెందాను. ఓ చిన్న సినిమాను తీశాం. ఎంతో మందిని తెరకు పరిచయం చేశా. అసిస్టెంట్ అవుదామని వచ్చిన రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో హీరో అయ్యాడు. అలానే ఈ సినిమా కూడా తీయాలని అనుకున్నాను. ఈ చిత్రం కోసం నేను ఏం చేయలేదు. అంతా శీనుయే చేశాడు. ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్‌తో నేను మాట్లాడలేదు. సినిమా అంతా అతనే భుజాన వేసుకున్నాడు. అందరూ దర్శకుడికి అండగా ఉన్నందుకు థ్యాంక్స్. రెండు గంటలు సినిమా చూసి అందరూ నవ్వుకునేలా ఉంటుంది అని అన్నారు.
 
డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ, ‘అన్నపూర్ణ సూడియోస్, శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పీ లాంటి పెద్ద బ్యానర్స్‌లో సినిమా చేయడంతో ఇప్పుడు నాకు దర్శకుడిగా అనుభవించు రాజా అని అనిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలను బట్టి సినిమా ఎలా ఉండబోతోందో అందరికీ అర్థమవుతుంది. కమర్షియల్, కామెడీ నేపథ్యంలో రాబోతోంది. ఓ భీమవరం కుర్రాడు.. వాడి లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్‌ల నేపథ్యంతో తెరకెక్కించాం. రాజ్ తరుణ్ బయట చాలా సైలెంట్‌గా ఉంటాడు.. కానీ తెరపై చాలా బాగా నటించాడు. ఈ సినిమాకు ప్రతీ ఒక్కరూ నాకెంతో సపోర్ట్ చేశారు ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. కశిష్ ఖాన్ చాలా బాగా నటించింది. ఇంత వరకు ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయలేదు. అలా మీడియాకు ఒకేసారి చూపించాలని అనుకున్నాను.’ అని అన్నారు.
 
హీరోయిన్ కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు మొదటి చిత్రం. ఈ అవకాశం ఇచ్చినందుకు సుప్రియ మేడం, డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. ఈ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది’ అని అన్నారు.
 
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇది నా మూడో చిత్రం. నాతో డ్యాన్సులు చేయించేందుకు కష్టపడ్డ విజయ్ మాస్టర్‌కు, ఫైట్లు చేయించేందుకు కష్టపడ్డ సతీష్ మాస్టర్‌కు అందరికీ థ్యాంక్స్. హీరోయిన్ కశిష్ ఖాన్ అద్భుతంగా సహకరించారు. కెమెరా వెనుక ఉన్నాడు కాబట్టి బతికిపోయాం. లేదంటే పెద్ద కమెడియన్ అయ్యేవాడు. సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా మాతో ఎంతో కలిసిపోయాడు అజయ్. అందరికీ థ్యాంక్స్.  ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఓ రెండు గంటలు నవ్వుకునేలా ఉంటుంది. మా చిత్రాన్ని దయచేసి థియేటర్లో చూడండి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments