డేటింగ్ చేయొచ్చుకదా? అంటూ అభిమాని సలహా .. నన్ను ఎవరు ప్రేమిస్తారంటా కొంటెంగా సమంత ప్రశ్న! (video)

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (11:49 IST)
అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక జీవిత సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్న హీరోయిన్ సమంత ఇపుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తనకు సోకిన అరుదైన వ్యాధి మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత... వరుస చిత్రాల్లో నటిస్తూ బీజిగా గడుపుతున్నారు. అదేసమయంలో సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని సమంతకు ఓ సలహా ఇచ్చారు. ఒంటరిగా ఉండటం కంటే.. ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా అని అడ్వైజ్ చేయగా, దానికి ఆమె బదులిస్తూ తనను ఎవరు ప్రేమిస్తారంటూ ప్రశ్నించారు. సమంత ఇచ్చిన షార్ప్ రిప్లైక్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 
 
ఈ నెల 26వతేదీ స్రవంతి సీఎం అనే ట్విట్టర్ యూజర్ సమంతకు అనుకోని విధంగా ఓ సూచన చేసింది. చెప్పడానికి ఇది నా స్థానం కాదని తెలుసు. కానీ, "దయచేసి ఎవరితో అయినా డేట్ చేయి" అంటూ ట్వీట్ చేసింది. కానీ, దీనికి సమంత ఇచ్చిన బదులు అందరి హృదయాలను గెలుచుకుంది. 
 
"మీ అంతలా నన్ను ఎవరు ప్రేమిస్తారు" అని సమంత ఆన్సర్ ఇచ్చింది. సమంత సమాధానం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. అభిమానులు ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. హాయ్ సమంత ఈ ప్రంపంచంలో అన్నిటికంటే నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని ఓ యూజర్ స్పందించారు. కాగా, ఆమె నటించిన శాకుంతలం చిత్రం వచ్చే నెల 14వ తేదీన విడుదల కానున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments