Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (13:10 IST)
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వచ్చిన వేణు మాధవ్.. బుధవారం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 
 
వేణుమాధవ్ మరణవార్తతో సినీ ప్రముఖుల, కుటుంబీకులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
వేణు మాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఓ షో చేశాడు. ఆ షో దివంగత ఎన్టీఆర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కొంత కాలంపాటు టీడీపీ కార్యాలయంలో కూడా వేణుమాధవ్ పని చేశారు. 
 
ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టారు. సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు ఆయన పరిచయమయ్యాడు. ఆపై స్టార్ కమెడియన్‌గా ఎదిగి.. దాదాపు 500 సినిమాలకు పైగా నటించాడు. అతని మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments