సంక్రాంతి అల్లుళ్ల దూకుడు... 'ఎఫ్2' మరో రేర్ ఫీట్.. అంతేగా...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:37 IST)
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ మూవీ "ఎఫ్2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). ఈ చిత్రం సంక్రాంతి పండుగకు విడుదలై బంపర్ హిట్ కొట్టేసింది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట మొదలుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విడుదలై 25 రోజులు గడిచినా ఇప్పటికీ పలు థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ కలెక్షన్లు దర్శనమిస్తున్నాయి. 
 
అంతేకాకుండా, రూ.30 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఎఫ్2... ఇప్పటివరకు రూ.75 కోట్ల మేరకు షేర్‌ను రాబట్టింది. ఈ పరిస్థితుల్లో మరో రేర్ ఫీట్‌ను సాధించింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఏకంగా రూ.5 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసిన ఆరో చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పూర్తి హాస్యభరితంగా నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్‌లు నటిస్తే, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. 
 
కాగా, కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు రూ.5 కోట్ల షేర్‌ను రాబట్టిన చిత్రాల జాబితాను పరిశీలిస్తే, బాహుబలి-2 రూ.14 కోట్లు, రంగస్థలం రూ.7 కోట్లు, బాహుబలి-1 రూ.6.86 కోట్లు, భరత్ అనే నేను రూ.5.80 కోట్లు, ఖైదీ నంబర్ 150 రూ.5.75 కోట్లు, ఎఫ్2 రూ.5 కోట్లు చొప్పున షేర్ రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments