దిల్‌రాజుకు అమ్ముడుపోయిన ఎగ్జిబిటర్లు - దిల్‌రాజు వర్సెస్‌ సి.కళ్యాణ్‌

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (17:53 IST)
Dil raju- ckalyan
ఆదివారంనాడు జరిగిన తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికల్లో దిల్‌రాజు అత్యధిక మెజార్టీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పోటీ అభ్యర్థి సి.కళ్యాణ్‌ దీనిపై సోమవారంనాడు ఓ విమర్శ చేశారు. ఎగ్జిబిటర్లు అంతా దిల్‌రాజుకు అమ్ముడుపోయారని అందుకే తాను ఓడిపోయానని వాపోయారు. దీనిపై ఎగ్జిబిటర్ల సంఘం అధ్యక్షుడు విజయేంద్రరెడ్డి ఓ వీడియోను విడుదలచేశారు.
 
ఎగ్జిబిటర్లు (థియేటర్‌ ఓనర్లు) అమ్ముడుపోయారని సి. కళ్యాణ్‌ చేసిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. 900 మందివి నిర్మాతల ఓట్లు కాగా, 400 ఓట్లు పంపిణీదారులవి. అందులో అధికభాగం దిల్‌రాజుకే ఓటు వేశారు. అదేవిధంగా డిస్టిబ్యూటర్‌ సెక్టార్‌ ఓటర్లలో 6-6, స్టూడియో సెక్టార్‌లో 3-1 ఓట్లు తేడావుంది. కనుక అత్యధిక మెజార్టీ దిల్‌రాజు సాధించాడు కాబట్టే మేము ఆయనకే ఓట్లు వేశాం. 
 
గత మూడురోజులుగా ఈ ఎన్నికల దృష్ట్యా వ్యాపారపరంగా కళ్యాణ్‌గానీ, దిల్‌రాజు కానీ ఎవరు వచ్చినా మంచి జరగాలని మా మీటింగ్‌లో కోరుకున్నాం. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ప్రజల ఓట్లు ద్వారా దిల్‌రాజు గెలిచాడు. మెజార్టీ సాధించాడు. ఇక్కడ ఎగ్జిబిటర్లు అమ్ముడుపోవడం వుండదు. వారికి ఆ దుస్థితి రాదు. 
 
ఏదైనా మెరిట్‌ థియేటర్‌ వుంటే ఏ సినిమాఅయినా  అక్కడే ప్రదర్శిస్తారు. దిల్‌రాజుకు ఓటేస్తే మంచి థియేటర్‌ ఇస్తాడనేది అబద్ధం. కళ్యాణ్‌ తన మాటలు వాపసు తీసుకోవాలని విజయేంద్రరెడ్డి వీడియోలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments