Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్‌కు అరుదైన గౌరవం.. ఎంఐటీలో యూఏవీ సిస్టమ్ అడ్వైజర్‌గా.. రూ.1000 జీతం?

కోలీవుడ్ అందగాడు అజిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. అజిత్‌ను "హెలికాప్టర్ టెస్టు పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి''గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపు

Webdunia
శనివారం, 5 మే 2018 (16:45 IST)
కోలీవుడ్ అందగాడు అజిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. అజిత్‌ను "హెలికాప్టర్ టెస్టు పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి''గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న తొలి నటుడిగా అజిత్ రికార్డ్ సాధించాడు.  ప్రస్తుతం అజిత్‌ దర్శకత్వంలోని ''విశ్వాసం''లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. 
  
అజిత్‌కు సినిమాలతో పాటు బైక్, కారు రేస్, ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. ఇటీవల హెలికాఫ్టర్లు, బుల్లి విమానాలు తయారు చేస్తూ వచ్చిన అజిత్.. వాటిని విజయవంతంగా ఎగురవేశారు. అంతేగాకుండా డ్రోన్‌ల తయారీపై కూడా అజిత్ దృష్టి పెట్టారు. 
 
ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు కొన్ని రోజుల క్రితం ఎంఐటీకి అజిత్ వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అజిత్‌ ఆసక్తిని ఆయకున్న నైపుణ్యతను గమనించిన ఐఐటీ.. ఆయనను హెలికాప్టర్ టెస్టు పైలట్‌గా నియమించింది. 
 
ఇందుకోసం రెండు గంటల పాటు అజిత్ ఎంఐటీ విద్యార్థులతో సెషన్ నిర్వహించారని.. ఈ సెషన్ కోసం అజిత్‌కు ఐఎంటీ రూ.1000లు ఆఫర్ చేసిందట. ఆ మొత్తాన్ని కూడా అజిత్ విద్యార్థుల నిధికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలుస్తోంది. డ్రోన్ తయారీని చాలా వేగంతో అజిత్ పూర్తిచేస్తారని.. అతి వేగంతో డ్రోన్‌ను అసెంబల్ చేసేవారని ఎంఐటీ ప్రొఫెసర్లు వెల్లడించారు. కాగా మే7వ తేదీ నుంచి అజిత్ విశ్వాసం సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments