Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కోలో కోల‌న్న కోలో` పాట‌ను ఎంజాయ్‌చేస్తోన్న‌ 'ట‌క్ జ‌గ‌దీష్‌'‌

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (18:11 IST)
Tak Jagdish, nani,
కుటుంబ అనుబంధాల‌ను తెలియ‌జేస్తూ, చిన్న‌నాటి కేరింత‌ల్ని గుర్తుచేస్తూ, నానిని మోటివేట్ చేస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యులు "కోలో కోల‌న్న కోలో``పాట‌ను ఆల‌పిస్తున్నారు. ఇది 'టక్ జగదీష్స చిత్రంలోని రెండో పాట‌. ఎస్‌. త‌మ‌న్ సినిమాలో సంద‌ర్భానుసారం వ‌చ్చే ఈ పాట‌కు చ‌క్క‌ని మెలోడీ ట్యూన్స్ స‌మ‌కూర్చారు. "కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు కిల‌కిల న‌వ్వాలి" అంటూ ప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ మోటివేష‌న‌ల్ సాంగ్‌ను అర్మాన్ మాలిక్‌, హ‌రిణి ఇవ్వ‌టూరి, శ్రీ‌కృష్ణ‌, త‌మ‌న్ క‌లిసి ఆల‌పించారు. నాని ఫ్యామిలీపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు.
 
చ‌క్క‌ని సాహిత్య విలువ‌ల‌తో, సంగీత వాయిద్యాల‌న్నీ చెవుల‌కు ఇంపుగా వినిపిస్తూ మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకొనే రీతిలో ఈ పాట ఉంది. "ఆ న‌లుగు‌రితో చెలిమి పంచుకో చిరున‌గ‌వు సిరులు పెంచుకో.. జ‌డివానే ప‌డుతున్నా జ‌డిసేనా త‌డిసేనా నీ పెద‌వుల‌పై చిరున‌వ్వులు ఎపుడైనా.." లాంటి లైన్లు సీతారామ‌శాస్త్రి గారికి కాకుండా ఎవ‌రికి సాధ్య‌మ‌వుతాయి! ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీతో దృశ్య‌ప‌రంగా ఈ పాట క‌న్నుల‌పంట‌గా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.
 
ఈ పాట‌లో నానితో పాటు ఆయ‌న‌ తండ్రిగా న‌టిస్తోన్న నాజ‌ర్‌, అన్న‌గా న‌టిస్తోన్న జ‌గ‌ప‌తిబాబు, హీరోయిన్లు రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్, ఫ్యామిలీ మెంబ‌ర్స్ అయిన రావు ర‌మేష్‌, రోహిణి, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న 'ట‌క్ జ‌గ‌దీష్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది. 'నిన్నుకోరిస‌ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments