Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతిపై దుష్ప్రచారం వద్దు... ప్లీజ్ : ఏక్తా కపూర్

నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. శ్రీదేవి మరణంపై దుష్ప్రచారం చేయొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (17:11 IST)
నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. శ్రీదేవి మరణంపై దుష్ప్రచారం చేయొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు. సర్జరీల కారణంగానే ఆమె మృతి చెందిందని, సర్జరీలు వికటించడంతో గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ ప్రచారంపై ఆమె స్పందిస్తూ, చెడు ప్రచారం చేసేవాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచన చేసింది. ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండా, హృదయ పనితీరు మెరుగ్గా ఉన్న వారికి కూడా గుండెపోటు వస్తుందన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలని కోరింది. 
 
ఎలాంటి హృద్రోగ సమస్యలూ లేకపోయినప్పటికీ, ప్రపంచంలో ఒక శాతం మందికి హఠాత్తుగా గుండెపోటు వస్తుందని తనకు తెలిసిన డాక్టర్ ఒకరు చెప్పిన విషయాన్ని ఏక్తా తన ట్వీట్ లో పేర్కొంది. పుకార్లు ప్రచారం చేసేవారు దీనిని గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించింది. ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, బాధపెట్టవద్దని నెటిజన్లకు ఏక్తా కపూర్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

Leopard: అలిపిరి నడకదారిపై కనిపించిన చిరుతపులి -భయాందోళనలో భక్తులు (Video)

వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త!

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments