Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే.. గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో పాటలోని పదాల్ని తొలగిస్తాం: హరీష్ శంకర్

బన్నీ, ద‌ర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేషన్‌లో వ‌స్తున్న ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ‘గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో’ అనే పాట‌లో వాడిన కొన్ని ప‌దాల‌పై బ్రాహ్మణ సంఘాలు అభ్యంత‌రాలు వ్యక్తమైన సంగతి తెలిసి

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (12:15 IST)
బన్నీ, ద‌ర్శకుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేషన్‌లో వ‌స్తున్న ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ‘గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో’ అనే పాట‌లో వాడిన కొన్ని ప‌దాల‌పై బ్రాహ్మణ సంఘాలు అభ్యంత‌రాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై హ‌రీశ్ శంక‌ర్ క్లారిటీ ఇచ్చాడు. ‘నేనూ బ్రాహ్మణుడినే..’ నా కులాన్ని ఎందుకు కించపరుస్తాను. దయచేసి సాహిత్యాన్ని అర్ధం చేసుకోవాలని చెప్పాడు. అయితే వివాదం సద్దుమనగలేదు. 
 
ఈ పాట‌లో ఉప‌యోగించిన‌ అగ్ర‌హారం, త‌మల‌పాకు అనే ప‌దాలను తొల‌గించాల్సిందేన‌ని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ప‌ట్టుబ‌ట్టడంతో ప్రస్తుతం హరీష్ వెనక్కి తగ్గాడు. ఆ పదాలను తొలగిస్తానని హరీష్ ప్రకటించాడు. ఈ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారం’తో పాటు అన్ని పదాలను తొలగిస్తామని ఆ పాట రచయిత సాహితి కూడా తెలిపాడు.
 
బ్రాహ్మణ సంఘం నేతలు హరీశ్ శంకర్‌, సాహితిలను వారి కార్యాలయంలో కలిసిన నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌టన చేశారు. తాము ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ పాటను రాయలేదని హ‌రీశ్ శంక‌ర్ అన్నారు.   

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments