Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుల్కర్ సల్మాన్ ఆవిష్కరించిన ది గోట్ లైఫ్ బిగినింగ్ లుక్

డీవీ
బుధవారం, 31 జనవరి 2024 (17:33 IST)
The Goat Life, Prithviraj
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, రన్వీర్ సింగ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి ది బిగినింగ్ పోస్టర్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. మూవీ టీమ్ కు దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ విశెస్ అందించారు. గత రెండు పోస్టర్స్ చూస్తే ఈ బిగినింగ్ పోస్టర్ భిన్నంగా ఉంది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణానికి ముందు సంతోషంగా ఉన్న నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు.
 
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు.  ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.
 
నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

సంబంధిత వార్తలు

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments