Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో రవితేజ పేరుందా? నోటీస్ అందిందా? తీసుకోని ఆ ఇద్దరెవరు? అరెస్టు తప్పదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 19 మంది పేర్లను లిస్ట్ అవుట్ చేయగా వారిలో 12 మంది ఏకంగా నోటీసులు కూడా పంపినట్లు తెలిసిందే. ఐతే 12 మందిలో ఇద్దరు నోటీసులను తీసుకోకుండా తిరస్కరించినట్లు సమ

Webdunia
శనివారం, 15 జులై 2017 (15:39 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 19 మంది పేర్లను లిస్ట్ అవుట్ చేయగా వారిలో 12 మంది ఏకంగా నోటీసులు కూడా పంపినట్లు తెలిసిందే. ఐతే 12 మందిలో ఇద్దరు నోటీసులను తీసుకోకుండా తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు 19 మందిలో 12 మందికే నోటీసులు వెళ్లగా మిగిలిన ఏడుగురికి కూడా ఇచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఆ ఏడుగురు టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న నటులని అంటున్నారు. 
 
మరోవైపు ఇప్పటికే ఈ కేసులో హీరో రవితేజ, డైరక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, ముమైత్ ఖాన్, కెమెరామ్యాన్ శామ్.కె.నాయుడు, యాక్టర్ సుబ్బరాజు, ఆర్ట్ డైరక్టర్ చిన్నా, హీరోలు తరుణ్, నవదీప్, తనీష్, నందులకు నోటీసులు అందినట్లు ప్రచారం జరిగింది. ఐతే వీరిలో చాలామంది తమకు డ్రగ్స్‌తో ఎలాంటి లింకు లేదనీ, తమకు సిగరెట్లు తాగడమే తెలియదని అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకోగలమని వాదిస్తున్నారు. 
 
ఇదిలావుంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకోని కొందరు నటీనటులు బ్యాంకాక్ చెక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ నెల 19 నుంచి 27వ తేదీ మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఎదుట హాజరై వివరణ ఇచ్చిన తర్వాతే వెళ్లాలనీ, దానికి భిన్నంగా ప్రవర్తిస్తే అరెస్ట్ తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో బ్యాంకాక్ వెళ్లాలనుకున్నవారు కాస్తా గప్ చిప్ మని ఇంట్లోనే కూర్చుండిపోయారట. 
 
ఇదిలావుంటే నోటీసులు అందుకోని మరో ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి సిబ్బంది నోటీసులు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది తెచ్చిన నోటీసులు కూడా తీసుకునేందుకు నిరాకరిస్తే వారిని అరెస్టు చేసే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తి షేక్ అవ్వడం ఖాయం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments