నా పేరు శివ, అందగారం చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేక మేడలు. బాహుబలి చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై హీరోగా రాకేశ్ వర్రే నటించిన ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఆయన నిర్మించిన పేక మేడలు చిత్రం టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు.
విశ్వక్సేన్ మాట్లాడుతూ రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్ ద బెస్ట్. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఇక చిత్రాల గురించి వస్తే... నా రెండు చిత్రాల గురించి వచ్చేవారం నుంచి అప్‌డేట్స్ ఇస్తా. వాటిలోపాటు ఓ సర్‌ప్రైజ్ కూడా ఇస్తాను. ముఖ్యంగా ఈ వేదికగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నాలాంటి వాళ్లు చిన్న హీరో అయినా చేస్తున్న పనిలో బిజీతో కొన్ని సందర్భాల్లో ఎవరికీ టైమ్ ఇవ్వలేము. కథలు వినలేము. తెలుగులో ఏ సినిమా హిట్ అయినా ఎక్కువశాతం ఆనందించేవాళ్లు ఉంటారు. ఏడ్చేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. ఇటీవల నాపై కొన్ని మీమ్స్ వచ్చాయి. కథ చెబుతానంటే టైమ్ ఇద్వలేదు.. వినలేదు అని. గంట సేపు ఓ మనిషికి కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలన ఆ చిత్రం పెద్ద హిట్ అయితే ఆనందించారు. డైరెక్టర్స్ గ్రూప్‌లో ఆ చిత్రం ట్రైలర్ రాగానే బావుందని మొదటి స్పందించింది నేనే. ఆ చిత్రం నేను చేయాలి. కానీ కుదరలేదు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు. అదొకటి నాకు బాధ అనిపించింది అని అన్నారు.
నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ హీరోగా నేను చేసిన ఎవరికి చెప్పొద్దు వచ్చిన మూడేళ్లకు ఈ సినిమా చేశారు అయితే నిర్మాతగా ఈ సినిమా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తాననుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ శశికిరణ్ తిక్కా, రాహుల్ సంక్రిత్యన్, తరుణ్ భాస్కర్‌లతోపాటు సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకులు సపోర్ట్‌తో ఆ సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో స్నేహితుడి ద్వారా పేక మేడలు కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్ చేశాం. ఎవరికీ చెప్పొద్దు చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో స్టాండర్డ్‌గా చేశాం. విష్వక్ గెస్ట్‌గా ఎందుకనే ప్రశ్న ఎదురైంది. తన కమిట్‌మెంట్ నాకు ఇష్టం. ప్రారంభంలోనే తను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. స్టార్ కావాలని అందరూ అనుకుంటారు. ఫలక్‌నుమా దాస్ చిత్రంతో తనని తానే స్టార్ చేసుకున్నాడు. ఎవరు అతన్ని స్టార్‌ని చేయలేదు. విశ్వక్‌తో మొదటి సినిమా చేసిన యాకుబ్ ఇప్పుడు నాతో సినిమా చేస్తున్నాడు. విష్వక్‌గా డెడికేటింగ్ చేయాలి అని వర్క్‌షాప్‌లో యాకుబ్ తరచూ చెబుతుండేవాడు. నేను అదే ఫాలో అయ్యా. ఇప్పుడు నేను పిలవగానే కాదనుకుండా టీజర్ రిలీజ్‌కి వచ్చాడు. ఈ చిత్రానికి వినోద్, అనూష యాప్ట్. వాళ్లిద్దరిమీదే సినిమా నడుస్తుంది. ఉత్తమ ఆర్టిస్ట్ కూడా వచ్చేంతగా యాక్ట్‌చేశారు.
దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశా. దీక్షితులుగారు మా మాస్టర్. యాక్టింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడే దర్శకత్వంపై ఆసక్తి ఉండేది. అనీస్ కురువిళ్లా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే ఈ కథ నా మనసులో మెదిలింది. బస్తీ లైఫ్ ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు పేక మేడలు కడతారు అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేశాం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదురయ్యే కథ ఇది. ఇలాంటి కథ బయటకు వెళ్తే బజ్ క్రియేట్ అవుతుందని నమ్మి చేశాం.రాకేశ్‌గారు విన్న వెంటనే నిర్మాతగా ఓకే అన్నారు. అలాగే మంచి టీమ్ కుదిరింది. హీరోహీరోయిన్లు యాప్ట్ అయ్యారు.
వినోద్ మాట్లాడుతూ పేక మేడలు చిత్రంలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. సెకెండ్ లాక్‌డౌన్‌లో నాకు వచ్చిన ఆఫర్ ఇది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ మెసేజ్ చూసి ఫేక్ అనుకున్నా. బట్ ప్రయత్నం చేశా. సినిమాలో భాగం అయ్యా. ఈ సిననిమా జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది. తెలుగు సినిమాలో నాన్ తెలుగు హీరోని తీసుకోవడం అంటే ఎంతో నమ్మకం ఉండాలి అని అన్నారు.
హీరోయిన్ అనుష సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసి సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు.