Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ర్ణ నుంచి విక్ర‌మ్ ఎందుకు బ‌య‌ట‌కి వ‌చ్చాడో తెలుసా!

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:25 IST)
ChiyanVikram twitter photo
చియాన్ విక్ర‌మ్ ఈ పేరు ప్ర‌యోగాల‌కు మారుపేరు. ఎటువంటి పాత్ర‌నైనా చేయ‌డానికి సిద్ధంగా వుంటాన‌ని విక్ర‌మ్ స్టేట్‌మెంట్ ఇచ్చేవాడు. యాభై దాటిన వ‌య‌స‌సులో కూడా త‌న బాడీని క‌స‌ర‌త్తుల‌తో మార్పు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. శివ‌పుత్రుడు, అప‌రిచితుడు, ఐ వంటి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌ను చేసి మెప్పించాడు. ఐ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదుకానీ న‌టుడిగా మంచి పేరు తెచ్చింది. ఇది చాలంటు విక్ర‌మ్ ఓసారి ప్ర‌క‌టించాడు. ఆమ‌ధ్య రెండేళ్ళ‌నాడు కేవ‌లం వ్యాయామాన్ని చేస్తూ త‌న బాడీని పౌరాణిక సినిమా కోసం మార్చుకున్నాడు.

మ‌హాభారంతో సూర్య వ‌ర‌ప్ర‌సాదమైన క‌ర్ణుని పాత్ర కోసం ఫొటోషూట్ కూడా చేశాడు. కొంత భాగం టెస్ట్ షూట్ జ‌రిగింది. భారీ బ‌డ్జెట్‌తో తీయ‌బోయే ఈ సినిమాను జాకీ భ‌గ్నాని, పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్త‌గా నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఇది 3డిలో వుండేలా ప్లాన్ చేశారు. అయితే ష‌డెన్‌గా ఈ సినిమాను త‌ప్పుకుంటున్న‌ట్లు విక్ర‌మ్ నిర్వ‌హించే సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసి వుంది. ఇందుకు విక్ర‌మ్‌కు జ‌రిగిన అవ‌మాన‌మే కార‌ణంగా పేర్కొంటున్నారు కొంద‌రు. వ‌య‌స్సురీత్యా బాడీని మార్చుకుంటూ వ‌స్తున్న విక్ర‌మ్‌కు ఇది గుదిబండ‌గా మారింది. నిర్మాణ‌సంస్థ‌ల‌లో కొన్ని లోపాలు కూడా వున్నాయ‌ని చెబుతున్నారు. ఇదిలా వుండ‌గా, అప్ప‌ట్లోనే మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి వంటివారు పౌరాణిక సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోనూ అజ‌య్‌దేవ‌గ‌న్ కూడా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఏదిఏమైనా క‌ర్ణుని జీవితంలో వున్న అడ్డంకులు సినిమాకు కూడా వున్నాయంటూ సెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments