Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ ఉగ్రం గా ఎందుకు మారాడో తెలుసా !

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (18:30 IST)
Naresh-ugram
'నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది. ఈ రోజు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ ఉగ్రం కథాంశాన్ని రివిల్ చేసింది. నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటం ఉగ్రం. అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్థులను పట్టుకోవడానికి మొగ్గుచూపుతాడు.
 
ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా, ట్రైలర్  రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ట్రైలర్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, రివిటింగా ఉంది.
 
విజయ్ కనకమేడల పాత్రను ఇంటెన్స్ గా ప్రజంట్ చేయడంతో పాటు  సబ్జెక్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ట్రైలర్‌లో యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌కు హామీ ఇస్తుంది. సిద్ టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బీజీఏం గ్రేట్ వాల్యుని జోడించాయి. నరేష్ భార్యగా మిర్నా కనిపించింది.
 
ఉగ్రం చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. నిర్మాణ ప్రమాణాలు చాలా ఉన్నతంగా వున్నాయి. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments