కిరణ్ అబ్బరం నటించిన మీటర్ సినిమాను మైత్రీ మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. రమేస్ కదూరి దర్శకుడు. తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. తనురాసుకున్న కథను తన గురువు మలినేని గోపీచంద్‌కు చెప్పారు. అలా మైత్రీ మూవీ మేకర్స్ లైన్‌లోకి రావడం జరిగింది. అయితే ఈ కథకు హీరోగా ముగ్గురు ప్రముఖ హీరోలకు దర్శకుడు రమేష్ కథ చెప్పారు. వారు కథ బాగుంది. రెండు సంవత్సరాలు ఆగమని చెప్పారు. దాంతో తనగురువు గోపీచంద్ సూచన మేరకు కిరణ్ అబ్బవరంకు సంప్రదించడం ఆయన వెంటనే ఓకే అనడం జరిగిపోయాయి.
హీరో కిరణ్ గురించి కథ పెద్దగా మార్చలేదుకానీ హీరోయిన్‌గా ఫేమస్ అయిన నటి కావాలని దర్శకుడు పట్టుపట్టాడు. కొత్త అమ్మాయి అయితే బెటర్ అని హీరో చెప్పడంతో నిర్మాతలు కూడా ఓకే అన్నారు. కానీ దర్శకుడు రమేష్ మనసు ఎందుకో ఒప్పలేదు. ఫైనల్‌గా తనే కాంప్రమైజ్ అయి మలయాళ నటి అతుల్య రవికి కథ చెప్పడం ఆమె చేస్తాననడం జరిగింది. సినిమా ఔట్‌పుట్ వచ్చాక తను పాత్రలో ఒదిగిన తీరు నాకు ఆశ్చర్యమేసింది. తను భవిష్యత్‌లో పెద్ద నటి అవుతుందని వద్దన్న దర్శకుడే కితాబిచ్చాడు. అదే సినిమారంగంలో ప్రత్యేకత.