Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినరో భాగ్యము విష్ణు కథ లా మొబైల్ నెంబర్ ట్రై చేయకండి : దర్శకుడు మురళి కిషోర్

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:07 IST)
Kiran Abbavaram, Sai Dharam Tej, Murali Kishore, Harish Shankar
మొబైల్ నెంబర్ నైబర్స్ కాన్సప్ట్ తో వస్తున్న చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మురళి కిషోర్ దర్శకుడు.  కిరణ్ అబ్బవరం హీరో. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి  అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా  సుప్రీం హీరో సాయి ధరమ్  హాజయ్యారు.  
 
మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... ఈ సినిమా నెంబర్ నైబర్ కాన్సెప్ట్ తో  తెరకెక్కుతుండంతో ఒక నైబర్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడారు. కిరణ్ అబ్బవరాన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించి తనకు ఇష్టమైన పర్సన్ అని చెప్పుకొచ్చారు. కాన్సెప్ట్ సినిమాలు ఆడుతున్నాయి అనే ఒక లైన్ ఉంటె ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. సో ఎందుకంటే ఈ సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉంది.
 
దర్శకుడు మురళి కిషోర్ మాట్లాడుతూ... ఇది నెంబర్ నైబర్స్ కాన్సప్ట్ తో వస్తున్న సినిమా మాత్రమే. దీని గురించి సినిమాలో మంచి చెడు ఉంటుంది. సో దయచేసి ఎవరికీ ప్రాంక్ కాల్స్ చెయ్యకండి. ఆ కాన్సప్ట్ ఎలా వచ్చింది అనేది తర్వాత రోజుల్లో చెబుతాను. ఇక్కడికి వచ్చిన వారందరికీ చాలా థాంక్యూ అండి. ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
 
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ,  కిరణ్ ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా చూసి ఒక సినిమా చెయ్యమని అడిగాను. ఈ సినిమాలో ఎక్కువ ఇన్వాల్ అవ్వకుండా వాళ్ళకే అప్పజెప్పేసాను. సినిమా చాలా బాగా వచ్చింది. కిరణ్ గారు, దర్శకుడు కిషోర్ గారు చాలా బాగా చేసారు. ఇక్కడికి వచ్చిన తేజు కి, హరీష్ శంకర్ కి, మారుతికి చాలా థాంక్యూ. తేజు నాకు ఒక బ్రదర్ లాంటివాడు, తన ఫస్ట్ సినిమాను చేయడం నా అదృష్టం. విరూపాక్ష సినిమా సినిమా అదిరిపోద్ది అని అన్నారు. 
 
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. అచ్చమైన తెలుగు టైటిల్. ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడు, కానీ అందరి ఇంట్లో ఉండే స్టార్ కిరణ్ అబ్బవరం.గబ్బర్ సింగ్ అయ్యాక నాకు అడ్వాన్స్ ఇచ్చాడు బన్నీవాసు ఇప్పటివరకు నేను సినిమా చెయ్యలేదు. బెస్ట్ ఫిలిం అనుకున్నప్పుడే నువ్వే వస్తావ్ ఈ కాంపౌండ్ కి అని చెప్తాడు. మంచి సినిమాలు చెయ్యాలి, కాన్సెప్ట్ సినిమాలు చెయ్యాలి అని జీఏ పిక్చర్స్  నిర్మించారు. బన్నీవాసు నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం. అలానే అరవింద్ గారి ప్రొడ్యూసర్స్ సినిమాకి చాలా అవసరం. ఈ సినిమా కాన్సప్ట్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. అన్నయ్య భాస్కర భట్ల మంచి లిరిక్స్ అందించాడు.
 
దర్శకుడు మారుతీ మాట్లాడుతూ... ఒక మంచి కాన్సప్ట్ ఉంటె గీతా ఆర్ట్స్ అంత త్వరగా డెసిషన్స్ తీసుకుంటుంది. వాసు ఇలా కాన్సప్ట్ సినిమాలు తియ్యడం చాలా హ్యాపీ గా ఉంది. పెద్ద సినిమాతో మొదలై ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు వాసు. కిరణ్ చాలా బాగా చేస్తున్నాడు. ఈ సినిమా కాన్సప్ట్ చాలా బాగుంది. ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, కే విశ్వనాథ్ గారితో వాసవ సుహాస సాంగ్ లాంచ్ చేసాము అంటూ ఆయనను గుర్తుచేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమా జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు. మా టీం అందరికి కృతజ్ణతలు. ఈ సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. భాస్కర భట్ల గారికి, కళ్యాణ్ చక్రవర్తిగారికి, సాయి ధరమ్ తేజ్ అన్నకి చాలా థాంక్యూ. నా ప్రతి సినిమాకి సాయి తేజ్ అన్న మంచి సపోర్ట్ ఇస్తారు.
మీరు ఇక్కడ ఉండటం చాలా సంతోషం అన్న. అలానే మీడియాకి చాలా థాంక్యూ అన్న నేను ఐదు సినిమాల్లో నేర్చుకున్నది ఈ సినిమాలో చేశాను. ఈ సినిమా గురించి నాకు ఎటువంటి భయం లేదు, ఈ సినిమా చాలామందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.
 
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... బన్నీవాసు, అరవింద్ గారు నాకు మంచి సపోర్ట్ చేసారు. ఈ సినిమా టీం అందరికి చాలా థాంక్యూ, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భారత్వాజ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఈ సినిమాకి భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు మంచి సాహిత్యం అందించారు అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments