Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంప్రమైజ్ కాలేదు...అందుకే పెద్ద హీరోలతో నటించలేకపోయా

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (11:11 IST)
టీడీపీ పార్టీలో చేరిన సీనియర్ హీరోయిన్ దివ్యవాణి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగిస్తున్నారు. పలు మీడియా సమావేశాలలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తరచుగా వార్తలలో నిలుస్తోంది. తాజాగా తన సినీ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది దివ్యవాణి. ఇక హీరోయిన్లు కాంప్రమైజ్ కావడం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. 
 
నేను చిన్న వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేసాను. పెళ్లి పుస్తకం చిత్రంలో నటించేటప్పటికి నా వయస్సు 16 ఏళ్ళు. 22 ఏళ్ల వయస్సుకే పెళ్లి పూర్తయి, పిల్లలు పుట్టారు. నా కొడుకులతో పాటు నేను బయటికి వెళ్తే ఆమె మీ అక్కా అని అందరూ అడిగేవారని సరదాగా పేర్కొన్నారు. సినిమాల్లోకి ప్రవేశించక ముందే నటనలో మంచి ప్రతిభ ఉండేది. 
 
అనుకోకుండా హీరోయిన్ అయ్యానే కానీ అడ్డదారులు తొక్కలేదు. ఏ దర్శకుడు, హీరో దగ్గర కాంప్రమైజ్ కాలేదు, కాబట్టే పెద్ద హీరోలతో సినిమా అవకాశాలు రాలేదని చెప్పిన దివ్యవాణి అన్ని భాషలలో కలిపి 40 చిత్రాల వరకు నటించానని తెలిపారు. సినిమాల్లోకి రాకముందు, వచ్చాక నాలో ఎలాంటి మార్పు లేదు. మిగతా హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా నా పెళ్లి పుస్తకం సినిమాకు సరిపోవని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments