Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు మళ్ళీ ఆహ్వానించాడు... దివ్యవాణి

''పదిహేనేళ్ల వయసు నుండి సినిమాల్లో నటిస్తున్నాను. పెళ్లైన తర్వాత ఏడేళ్లు గ్యాప్‌ తీసుకున్నాను. నాకు ఇష్టమైన ఈ ఫీల్డ్‌కు దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. బైబిల్‌లోని ఓ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఓ కుంటుంబంలోని ప్రేమానురాగాలను ఆధారంగా చేసుకుని స

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (19:47 IST)
''పదిహేనేళ్ల వయసు నుండి సినిమాల్లో నటిస్తున్నాను. పెళ్లైన తర్వాత ఏడేళ్లు గ్యాప్‌ తీసుకున్నాను. నాకు ఇష్టమైన ఈ ఫీల్డ్‌కు దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. బైబిల్‌లోని ఓ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఓ కుంటుంబంలోని ప్రేమానురాగాలను ఆధారంగా చేసుకుని సినిమా ఉంటుంది. నయోని అనే పాత్రలో కనపడతానని'' దివ్యవాణి చెప్పారు.
 
ప్రాజ్ఞేయ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్రవంతి సమర్పణలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'నీ దేవుడే నా దేవుడు'. చిత్ర ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దివ్యవాణి కీలక పాత్ర పోషిస్తుంది. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టిన అనంతరం బాబూమోహన్‌ మాట్లాడుతూ... ఇష్టమైన హీరోయిన్‌ దివ్యవాణి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేయడం విశేషం. బైబిల్‌ సంబంధిత సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. 'తొలి కిరణం' దర్శకుడు జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బైబిల్‌లోని అత్తాకోడళ్లుకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మంచి మెసేజ్‌ ఉన్న చిత్రమని' తెలిపారు.  
 
'''తొలి కిరణం' తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. రెండు షెడ్యూల్స్‌లో పూర్తవుతుంది. ఇది హిస్టారికల్‌ చిత్రం. క్రీస్తుపూర్వం ఇజ్రాయిల్‌ దేశంలో జరిగిన అత్తాకోడళ్లు కథ. దాదాపు పది కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మాత తెరకెక్కిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 26 వరకు జరుగుతుంది. రెండో షెడ్యూల్‌ టర్కీలో చిత్రీకరిస్తాం. జూన్‌లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. దివ్యవాణి మా సినిమా నటించడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. ఆర్‌.పి.పట్నాయక్‌గారు మంచి సంగీతాన్ని అందించారని'' దర్శకుడు జాన్‌ బాబు తెలియజేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments