Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంశ కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, త్వరలో నేను 6 సినిమాలతో రాబోతున్నా : హీరో సిద్ధార్థ్

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (06:19 IST)
Divyansha, Siddharth
హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 'టక్కర్'. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో భాగంగా "టక్కర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ మరియు  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు.
 
Tucker prerelease
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ, విశ్వప్రసాద్ గారు , వివేక్ గారు నాకు మంచి ఫ్రెండ్స్, సిద్దార్థ్ నాకు చాలా కాలం నుండి మంచి ఫ్రెండ్. ఐ విష్ హిమ్ అల్ ద బెస్ట్. బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ అందరు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
 
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఇక్కడికి రావడం చాలా హ్యాపీ గా ఉంది. సిద్దార్థ్ గారు ఈ జనరేషన్ కమల్ హాసన్ లా అనిపిస్తారు. సిద్దార్థ్  అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా సినిమా థియేటర్ కి వెళ్లి చూద్దాం.
 
చిత్ర దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ మాట్లాడుతూ, . ఈ సినిమాలో యూనివర్సల్ కంటెంట్ ఉంది.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి మూడు కారణాలు, మొదటది మీ సిద్దార్ధ్ , తరువాత దివ్యాంశ. మా గురువు గారు శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడే అదే బాటలో శిష్యుడు సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చెయ్యండి.
 
 ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, నేను అమెరికాలో పది సంవత్సరాలు నుంచి ఉంటున్నాను. సినిమాలు డీవిడిలో చూడటం దగ్గరనుంచి థియేటర్ లో నేను చూసిన మొదటి సినిమా బొమ్మరిల్లు. అప్పటినుంచి సినిమాలు థియేటర్ లో చూడటం అలవాటు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా ఎరా నడుస్తోంది. మేము సుభాన్ గారితో కలిసి త్వరలో తెలుగులో సినిమాను నిర్మించబోతున్నాం అన్నారు.
 
హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ..ఈ సినిమాను మంచి స్కేల్ లో తీశారు. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్ గారు. ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. నేను రామానాయుడు గారితో చాలా సార్లు మాట్లాడాను. నాకు సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సురేష్ బాబు గారి వచ్చి ఈ టీం ను బ్లేస్ చేసినందుకు థాంక్యూ సో మచ్. తెలుగు సాహిత్యం , తెలుగు కవిత్వం చూసి , చదివి అది నా లోపలకి వెళ్ళిపోయింది. సో నేను చెప్పిన చెప్పకపోయినా తెలుగు బిడ్డే. జూన్ 9న టక్కర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా 100% అలరిస్తుంది. త్వరలో నేను 6 సినిమాలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments