Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో 'లోఫర్' బ్యూటీ మెస్మరైజ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (08:50 IST)
ఇటీవలికాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాల్దీవులు సినీ సెలెబ్రిటీలకు మంచి టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారింది. కొద్దిగా సమయం దొరికితే చాలు అనేక మంది సెలెబ్రిటీలు ఇక్కడ వాలిపోతున్నారు. మాల్దీవుల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, ప్రత్యేక దుస్తులు ధరించి ఫోటో షూట్‌లు నిర్వహిస్తున్నారు.
 
తాజాగా ఈ కోవలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా చేరింది. గతంలో 'లోఫర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె... ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి "యోధ" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
 
అయితే, ఈ అమ్మడు తన బార్బీ అందాలను దాచుకునేందుకు ఏమాత్రం ఇష్టపడదు. అందుకే కుర్రకారుకు అందాల పండుగలా ఉంటుంది. ఈ అందాలనను ఫోటోల రూపంలో బంధించి తన అభిమానలకు కిక్ ఇవ్వడానికి దిశా పటానీ ఏమాత్రం వెనుకాడరు.
 
తాజాగా దిశా తన ఇన్‌స్టా ఖాతాలో బికినీలో సముద్రపు నీటిపై తేలియాడుతూ దిగిన బ్యూటీఫుల్ పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్‌లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే అందం, మాల్దీవుల్లోని సముద్రపు నీటిలో వివిధ రకాల భంగిమల్లో ఆమె హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments