Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో టాలీవుడ్ నటి మేనకోడలు అదృశ్యం...

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటీమణులు డిస్కో శాంతి, లలిత కుమారిల మేనకోడలు అపర్ణ (17) అదృశ్యం ఇపుడు కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం అపర్ణ అదృశ్యం కాగా, ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు.

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (12:33 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటీమణులు డిస్కో శాంతి, లలిత కుమారిల మేనకోడలు అబ్రిన (17) అదృశ్యం ఇపుడు కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం అబ్రిన అదృశ్యం కాగా, ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో అబ్రిన తల్లి సెరిల్, మేనత్త డిస్కోశాంతి (ప్రకాశ్ రాజ్ మొదటి భార్య) మీడియా ముందుకు వచ్చారు.
 
చైన్నైలోని టీనగర్‌లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్‌ మొళివర్మన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె అబ్రిన నగరంలోని చర్చ్ పార్క్ స్కూల్‌లో ప్లస్ టూ చదువుతోంది. ఈ నెల 6వ తేదీన స్కూల్‌కు వెల్లిన అబ్రిన.. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. 
 
ఆ యువతి కోసం బంధువులు, స్నేహితులు, చైన్నైలోని వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు పాండీ బజార్ పోలీసులను ఆశ్రయించారు. కానీ, అపర్ణ అదృశ్యమై వారం రోజులైనా ఆచూకీ లభించక పోవడంతో వారు కంగారు పడుతున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికే అబ్రిన చదువుతున్న చర్చ్‌ పార్క్ స్కూల్‌లో విచారించారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్‌ను పరిశీలించారు. అయినా, ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
 
ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం మెతక వైఖరిని అవలంభిస్తున్నట్లు అనిపిస్తోంది. మీడియా ద్వారా మా అమ్మాయి ఆచూకీ దొరకుతుందన్న ఆశతో మీ ముందుకు వచ్చినట్టు వారిద్దరూ బోరున విలపిస్తూ విలేకరుల వద్ద వాపోయారు. అబ్రిన తల్లి సెరిల్‌ మాట్లాడుతూ తమ బిడ్డ ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments