Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ బాటలో తేజ.. బాహుబలి చూడలేదు.. నిజం మహేష్‌తో కాకుండా..?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (12:59 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందున్న రామ్ గోపాల్ వర్మ బాటలోనే దర్శకుడు తేజ కూడా పయనిస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. పవన్ కల్యాణ్ అభిమానులకు రామ్ గోపాల్ వర్మకు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో తేజ తెరపైకి వచ్చేశాడు. ఇటీవల తేజ తెరకెక్కించిన హోరా హోరీ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కావట్లేదు.
 
ఇటీవల మహేష్ బాబు శ్రీమంతుడుపై కామెంట్ చేసిన తేజ.. తాజాగా బాహుబలిపై పడ్డాడు. అప్పట్లో సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోల మీద పడి ఏడ్చిన తేజ.. ప్రస్తుతం సినిమాలు లేకపోయినప్పటికీ సెన్సేషనల్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. 
 
తన సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో రివ్యూ చూసుకోవాల్సిన అవసరం తనకి లేదని దురుసుగా ప్రవర్తిస్తున్న తేజ... తెలుగు సిని చరిత్రలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన బాహుబలి సినిమా చూడలేదని హాట్ కామెంట్ చేశాడు. బాహుబలి సినిమా తేజ చూడకపోవడం పెద్ద విషయం కాకపోయినా.. సూపర్ హిట్ టాక్‌తో బాలీవుడ్ హీరోలకు కూడా చెమటలు పట్టేలా చేసిన రాజమౌళికి తేజ వ్యాఖ్యలు జక్కన్నను అవమానపరిచినట్టేనని సినీ పండితులు అంటున్నారు. 
 
దీంతో వదిలిపెట్టకుండా మహేష్ బాబుతో కాకుండా నిజం సినిమా ఏ ఉదయ్ కిరణ్‌తోనో, నితిన్‌తోనో తీసుంటే బాగా ఆడేదని, ఇక తన సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ అసలు పనికిరాడని తేజ అంటున్నాడు. తేజ వ్యవహారం చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ లాగానే ఏదో ఒక విషయంపై దుమారం లేకపోతే తేజకు నిద్రపట్టేట్లు లేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయినా వర్మ మాటలే పట్టించుకోని ప్రేక్షకులు.. ఇక తేజ మాటల్ని పెద్దగా పట్టించుకోరని వారు చెప్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments