Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఇష్టం.. రామ్ గోపాల్ వర్మ

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (11:20 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. గతేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో టాలీవుడ్‌లో రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తన నిర్మాణంలో శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో ‘బ్యూటీఫుల్’ సినిమాను తెరకెక్కించాడు.
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ జోరుగా చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి వర్మ బ్యూటీఫుల్ హీరోయిన్ నైనా గంగూలి కాళ్లు పట్టుకున్న సంగతి తెలిసిందే.
 
ఈ సందర్భంగా వర్మ.. పవన్ కళ్యాణ్‌కు బహిరంగ క్షమాపణలు కోరాడు. ఈ సందర్భంగా ఆర్జీవి మాట్లాడుతూ.. పవన్ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది.. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. 
 
అందుకే ఆయన స్టార్ అయ్యాడు. నన్ను క్షమాపణ కోరాడు. ప్రమాణం చేసి చెబుతున్నా.. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఇష్టం. నేను దేవుడ్ని నమ్మను. మీరు నా మాటలు నమ్మకపోతే నేనేం చేయలేను అని వర్మ అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments