క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను రివిల్ చేశారు. తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.
తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం.
దర్శకుడు ఒక నోట్ ని రాశారు "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్ మేవెన్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాకు చేరవేయడానికి "talent@thepvcu.com"కి పంపండి!
ప్రశాంత్ వర్మ తన PVCU ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి యూనివర్స్ బిగినింగ్ కి ముందే చెప్పారు . మునుపెన్నడూ లేని విధంగా వర్క్ ఫోర్స్ ని నిర్మించాలని ఆయన సంకల్పించారు.
PVCU నుండి నెక్స్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్‌ల కోసం గెట్ రెడీ.