Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళయాలంలో తెలుగు దర్శకుడు నీలకంఠ ‘జామ్ జామ్’

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:16 IST)
బాలీవుడ్‌లో క్వీన్ మూవీతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన క్వీన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ అతి పెద్ద విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మళయాలంలో ‘జామ్ జామ్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మంజిమా మోహన్ కథానాయిక. కేవలం మలయాళ వెర్షన్‌కు మాత్రమే మన తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించారు.
 
తెలుగులో షో సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న నీలకంఠ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం విశేషం. ఇక రీసెంట్‌గా ఈ రీమేక్‌కు సంబంధించిన నాలుగు భాషల టీజర్స్ విడుదలయ్యాయి. మళయాల వెర్షన్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రీమేక్ అయినా అత్యంత సహజంగా కేరళ నేచురాలిటీకి దగ్గరగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌కు అద్బుతమైన స్పందన రావడం విశేషం. త్వరలో ట్రయిలర్ మరియు సినిమ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. 
 
ఇక మీడియెంట్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో మంజిమా మోహన్ తో పాటు సన్నీవేన్, షిబానీ దండేకర్, బాయిజు, ముత్తుమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగానూ అత్యున్నతంగా కనిపిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మిచెల్లే టబురెక్సీ, సంగీతం : అమిత్ తివారీ, ఎడిటింగ్ : ప్రదీప్ శంకర్ , రచన : విపిన్ రాధాకృష్ణ,సహ నిర్మాత : పారుల్ యాదవ్, నిర్మాత : మను కుమరన్, స్క్రీన్ ప్లే  దర్శకత్వం : నీలకంఠ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments