Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకులు నాగ్ అశ్విన్ ఆవిష్క‌రించిన‌ @ లవ్ టైటిల్

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (16:55 IST)
Nag Ashwin, Mahender Singh, Shailaja Taticharla, Sreenarayana
ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం '@లవ్'. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ మరియు డాక్టర్ మారుతి సకారం తదితరులు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.  
 
ఈ సినిమా టైటిల్ లోగోను  టాలెంటెడ్ డైరెక్టర్  నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు.  గిరిజన నేపథ్యంలో  స్వచ్ఛమైన ప్రేమ కథతో  రాబోతున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని.. అందులో భాగంగానే.. నేడు తాను ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు.  
      
వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు.  TMS బ్యానర్ లో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ కలయికతో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మాతలుగా  రూపొందించిన ఈ చిత్రంలో అందరూ నూతన నటీనటులు నటించారు. శ్రీనారాయణ దర్శకత్వంలో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో పాటు  ఆడజాతికి సంబంధించిన ఓ  గొప్ప సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుందట. ఈ సినిమా మొత్తం ఆటవిక నేపథ్యంలో సాగడం విశేషం.
 
నటీనటులు: రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ, డా. మారుతీ సాకారామ్ తదితరులు.
 
నిర్మాతలు: మహేందర్ సింగ్, శైలజ తాటిచర్ల, శ్రీనారాయణ
రచన దర్సకత్వం: శ్రీనారాయణ
మ్యూజిక్: సన్నీ మానిక్, రామ్ చరణ్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరామెన్: మహేందర్
సౌండ్ డిజైన్: యతీరాజ్
పీఆర్ఓ: శ్రీధర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments