Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2 రచయితకు పాదాభివందనం అన్న దర్శకుడు క్రిష్

బాహుబలి 2 రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు పాధాభివందనం చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. విజయేంద్రప్రసాద్‌ను ఇంటర్వ్యూ చేసిన ఒక తెలుగు టీవీ చానెల్ మధ్యలో క్రిష్‌కి ఫోన్ కలిప

Webdunia
సోమవారం, 1 మే 2017 (10:43 IST)
బాహుబలి 2 రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు పాధాభివందనం చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. విజయేంద్రప్రసాద్‌ను ఇంటర్వ్యూ చేసిన ఒక తెలుగు టీవీ చానెల్ మధ్యలో క్రిష్‌కి ఫోన్ కలిపినప్పుడు తన నోటినుంచి వెలువడిన మాటలివి.  "కంగ్రాచ్యులేషన్స్ సర్, మీకు పాదాబివందనాలు..బాంబేలో అంధేరీలోని పీవీఆర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు  బాహుబలి2 సినిమాను మా టీమ్ మొత్తం వెళ్లి చూశామండీ. సినిమా ముగిసిపోయాక థియేటర్లో చప్పట్లు కొడుతూ నిలుచున్నాం. ఎక్స్‌ట్రార్డినరీ మూవీ బాలీవుడ్‌లో ప్రతి నిర్మాతా, దర్శకుడూ బాహుబలి2 కి ముక్తకంఠంతో సెల్యూట్ చేస్తున్నారు. చెన్నయ్‌లో నా మిత్రుడు విజయ్ (దేవీ తిరుమగన్, నాన్న మదరాసి పట్టణం) పోన్ చేశాడు. ఏంటీ ఈ పెర్ఫార్మెన్స్, ఏం చేశారు, ఏం చేశారు ఈ సినిమాలో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన.

 
 
.. బాలీవుడే కాదు. తమిళంలోనే కాదు ప్రతి ఒక్కరూ ఈ సినిమా పట్ల గర్వంగా ఫీలవుతున్నారు. మిలటరీ క్రమశిక్షణ వంటి డిసిప్లైన్, అద్భుత సంస్ధాగత నిర్మాణం ఉన్న ఆర్గనైజేషన్ లేకపోతే ఇలాటి సినిమాలు రావడం అసాధ్యం అండీ. ఆర్కా మీడియా షోబు, ప్రసాద్‌ల తొలి చిత్రం వేదం నేను డైరెక్టు చేశాను. అది నాకు గర్వంగా ఉంది. బాహుబలిని నిర్మించిన వారికి అభినందనలు తెలుపుతున్నాను. డీప్లీ ఎమోషన్, ఎక్స్‌ట్రార్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం అండీ. 
 
కట్టప్ప బాహుబలిని చంపని పరిస్థితులు సినిమాలో క్రియేట్ అయినాయి. కట్టప్ప చేతులకు అంటిన రక్తాన్ని అందరికీ పంచడంలో, అందరినీ బాద్యులను చేయడంలో రాజమౌళి చూపిన ప్రతిభ అనితర సాధ్యం. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ అత్యున్నత స్థాయిలో ఉంటే, రచయితగా విజయేంద్ర ప్రసాద్ గారు కథను మలిచిన తీరు అపూర్వం. శివగామి ఒక అడుగు కూడా ముందుకు కదపకూడని స్థితిలో అమరేంద్ర బాహుబలి ఎలా ఆమెకు అడ్డు నిలుస్తాడో,  అలాగే దేవసేన తన అడుగు తప్పకుండా నడవడానికి మహేంద్ర బాహుబలి సహాయపడతాడు. రైటింగ్‌లో ఆ సైకిల్.. ఒక వలయాన్ని పూర్తి చేసే ఘటనలు సినిమాలో కోకొల్లలుగా ఉన్నాయి. 
 
రెండు భాగాల సినిమాలో ప్రతి దృశ్యానికీ ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటంది. చివరికి వచ్చేసరికి ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. బ్యూటిఫుల్ రైటింగ్, అండ్ ఎక్స్‌ట్రీమ్లీ గ్రేట్‌లీ డైరెక్టెడ్ అండీ. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఎమోషన్స్‌తో  కట్టిపడేశారండి. కట్టప్ప బాహుబలిని చంపక తప్పని పరిస్థితులు, వాటి చుట్టూ తిరిగే పాత్రలు.. నాకయితే మాహిష్మతి సామ్రాజ్యంలో ఉండి వాళ్లందరినీ చూసి వచ్చినట్లుంది. మరోసారి విజయేంద్రప్రసాద్ గారికి అభినందనలు చెపుతున్నాను. 
 
క్రిష్ బాహుబలి2 పై తన అభిప్రాయం చెప్పి విజయేంద్ర ప్రసాద్ కథా విశిష్టతను ప్రశంసించినప్పుడు విజయేంద్ర ప్రసాద్ క్రిష్‌కు కృతజ్ఞతలు చెప్పడమే కాదు. మీ ప్రశంస నాకు గొప్ప గౌరవం అన్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments