Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (22:12 IST)
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి మండలి అధ్యక్షుడు దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయనతో పాటు నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పాల్గొని డ్రగ్స్‌పై తమ గళం వినిపించారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను ఈ సందర్భంగా వారు వివరించారు. యువతకు దిశానిర్దేశం చేశారు. 
 
ఇందులో దిల్ రాజు మాట్లాడుతూ, మలయాళ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారన్నారు. అక్కడ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వారిని పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారు. తెలంగాణ ఎఫ్.డి.సి తరపున తెలుగు చిత్రపరిశ్రమ తరపున తాను కోరేది ఒక్కటేనన్నారు. మన దగ్గర కూడా అలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత వ్యక్తులను ఇండస్ట్రీలో అడుగుపెట్టకుండా నిషేధించాలి. 
 
అపుడే సమాజానికి బలమైన సందేశం వెళుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని చిత్రపరిశ్రమ పెద్దలతో చర్చించి, తెలుగు సినిమాల్లో కూడా ఈ నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటామని, ఇది మనందరి కర్తవ్యమని దిల్ రాజు పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments