Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘా ఆకాశ్‌కు సూపర్ ఛాన్స్.. నీదీ నాదీ ఒకటే లోకం అంటూ రాజ్‌తరుణ్‌తో..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:49 IST)
మేఘా ఆకాశ్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు కృష్ణారెడ్డితో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా చేశాడు. రాజ్ తరుణ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్న దిల్ రాజు .. కథానాయికగా మేఘా ఆకాశ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకటే లోకం' పేరుతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమాపైనే మేఘా ఆకాశ్‌ ఆశలు పెట్టుకుంది. కాగా 'లై' సినిమా ద్వారా మేఘా ఆకాశ్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత మళ్లీ నితిన్ జోడీ కడుతూ 'ఛల్ మోహన్ రంగా' చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. అందరిలానే తాను కూడా తమిళ చిత్రపరిశ్రమకి వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 
 
ఇప్పటికే అత్తారింటికి దారేదీ తమిళ రీమేక్‌లో మేఘా ఆకాశ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో దిల్ రాజు నిర్మించే తాజా సినిమా కోసం మేఘా ఆకాశ్ కసరత్తులు మొదలెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments