Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రెమో' చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు: దిల్‌రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం 'రెమో'. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భ

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (15:54 IST)
24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం 'రెమో'. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్య‌రాజ్ క‌న్న‌న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ల‌వ్ఎంట‌ర్‌టైన‌ర్ నవంబ‌ర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజైంది. ఈ సినిమా విడుద‌ల రోజు నుంచి సూప‌ర్‌హిట్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టుకోవ‌డ‌మే కాకుండా మంచి క‌లెక్ష‌న్స్‌తో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. 
 
దీనిపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'ల‌వ్‌, కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా న‌వంబ‌ర్ 25న విడుద‌లైన రెమో చిత్రం పెద్ద స‌క్సెస్ అయ్యింది. మొద‌టి మూడు రోజులు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. త‌ర్వాత మంచి క‌లెక్ష‌న్స్‌తో స్ట‌డీగా సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. భాగ్యరాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకోవ‌డం చూస్తుంటే చాలా హ్య‌పీగా ఉంది. శివ‌కార్తీకేయ‌న్‌కు తెలుగులో రెమో మంచి డెబ్యూ మూవీ అయ్యింది. ఈ సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌' అన్నారు.
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఆర్‌.డి.రాజా మాట్లాడుతూ... 'త‌మిళంలో రెమో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. మంచి ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌. మంచి క‌థ‌, కొత్త‌ద‌నాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తానే న‌మ్మ‌కంతో తెలుగులో న‌వంబ‌ర్ 25న దిల్‌రాజు స‌హ‌కారంతో సినిమాను తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేశాం. తెలుగులో మేం ఊహించిన దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శివ‌కార్తీకేయ‌న్‌కు రెమో తెలుగులో మంచి ఎంట్రీ అవుతుంద‌ని విడుద‌ల‌కు ముందు భావించాం. మేం అనుకున్న‌ట్టుగానే సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రించారు. సినిమా విజ‌యంలో భాగమైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌' అన్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments