Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండా మునగబోయిన దిల్ రాజు.. ఫిదాతో బతికిపోయాడు.. 5 రోజుల్లోపే లాభాల బాట

తెలుగు చిత్ర నిర్మాతగా దిల్ రాజు పని అయిపోయినట్లే అని అందరూ భావిస్తున్న సమయంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి నటించిన ఫిదా చిత్రం ఆపద్బాంధవిలా ఆదుకుందని టాక్. విడుదలై అయిదు రోజులు కా

Webdunia
బుధవారం, 26 జులై 2017 (06:39 IST)
తెలుగు చిత్ర నిర్మాతగా దిల్ రాజు పని అయిపోయినట్లే అని అందరూ భావిస్తున్న సమయంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి నటించిన ఫిదా చిత్రం ఆపద్బాంధవిలా  ఆదుకుందని టాక్. విడుదలై అయిదు రోజులు కావస్తున్నా హౌస్‌పుల్ కలెక్షన్లతో నడుస్తున్న ఫిదా కేవలం నాలుగు రోజుల్లోనే 16.5 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ సాధించి మంగళవారం నాటికే ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టిందని ట్రేడ్ విశ్లేషకులు ప్రకటించారు. ప్రింట్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో పాటు ఫిదా థియేట్రికల్ రైట్స్ 18 కోట్ల రూపాయలని తెలుస్తోంది. 
 
మరోవైపున మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్‌కి మొట్టమొదటి కమర్షియల్ హిట్‌ ఫిదా రూపంలో వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో తీసిన కంచె కూడా సాధించని విజయాన్ని వరుణ్ తేజ్ ఫిదాతో అందుకున్నాడు. మరోవైపున హ్యాపీ డేస్ తర్వాత గత పదేళ్లుగా సరైన విజయం కోసం ముఖం వాచి ఉన్న శేఖర్ కమ్ముల ఫిదాతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు తనకు ఊహించనంత రేంజిలో అవకాశాలు రాబోతున్నాయి.  
 
ఇక తమిళనాడుకు చెందిన హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ కంటే ఎక్కువ పేరును ఫిదాతో సంపాదించుకుంది. ప్రాంతీయ భేదాలు లేకుండా టాలీవుడ్ సాయి పల్లవిని ఒక్క సినిమాతోనే సొంతం చేసుకుంది. ఇక తెలంగాణ ప్రేక్షకులయితే సాయి పల్లవి అచ్చ తెలంగాణ యాసలో పలికిన డైలాగులకు నిజంగా ఫిదా అయిపోతున్నారు. ధియేటర్లో ఆమె పలికిన డైలాగులకు కరతాళ ధ్వనులతో స్వాగతించిన వారు ధియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా మౌత్ టాక్ ద్వారా ఆమెకు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
పాఠకులు మరోలా భావించకుంటే అసలైన తెలంగాణ సినిమాకు ఫిదాతో నాంది పలికినట్లుంది. ఒక ప్రాంత యాసను కామెడీ పాత్రలకు పరిమితం చేసి వెగటు హాస్యం పుట్టించే పద్ధతికి భిన్నంగా దిల్ రాజు, శేఖర్ కమ్ముల చిత్రం తెలంగాణ యాసకు ఫిదాతో శిఖరస్థాయిని కల్పించింది. తెలంగాణ ప్రేక్షకులు ఫిదాతో, ముఖ్యంగా సాయి పల్లవి పాత్ర భానుమతితో తాదాత్మ్యం చెందుతున్నారంటే ఈ చిత్రం సంభాషణలు తెలంగాణా ఆత్మను పట్టుకున్నాయి. అందుకే సినిమాలో కంటెంటు పరంగా ఎన్ని లోపాలు వెతకడానికి వీలున్నా.. తెలంగాణ భాషకున్న నిసర్గ సౌందర్యం సాయిపల్లవి పాత్ర ద్వారా నిరుపమాన రీతిలో తెరకెక్కింది. నిజంగానే తెలంగాణ సినీ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అనే చెప్పాలి.
 
ఇక వరుణ్ తేజ్.. హీరోయిజానికి ఎలాంటి అవకాశం లేని సాఫ్ట్ పాత్రలో అనితర సాధ్యం అనిపించేంత అద్భుతంగా ఒదిగిపోయాడు. భానుమతి గద్దింపులను కూడా పాజిటివ్‌గా తీసుకున్న తేజ్ పాత్ర అతడిలోని కొత్త రూపాన్ని తెరపై మనోహరంగా ప్రదర్శించింది. మెగా ఫ్యాన్స్ హీరోయిజం ఎలివేట్ కాని పాత్రను వరుణ్ తేజ్‌లో చూస్తూ మురిసిపోతున్నారు. ఆరకంగా వారు కథ బాగుంటే, పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసేవారుంటే తాము హీరోయిజాన్ని కూడా పట్టించుకోకుండానే చిత్ర విజయానికి సహకరిస్తామని తొలిసారిగా ప్రదర్సించి చూపారు. 
 
మెగా ఫ్యామిలీ నుంచి చాన్నాళ్ల తర్వాత హీరోయిజం లేని పాత్ర తెరపైకి వచ్చి ఇంత విజయాన్ని సాధిస్తున్నందుకు, మెగా ఫ్యాన్స్ దాన్ని ఆదరిస్తున్నందుకు వరుణ్ తేజ్ నిజంగా అదృష్ట వంతుడు. కథా బలం లేకుంటే వరుణ్ తేజ్‌ని ఇంత సాప్ట్ పాత్రలో చూపినందుకు చిత్రం ఎక్కడో తేలిపోయేది. 
 
ఫిదా చిత్రం తొలి విడతలో 30 కోట్ల రూపాయల టార్గెట్‌ని ఈజీగా సాధిస్తుందని చెబుతున్నారు. తర్వాత ఎన్ని రోజులాడుతందనే లెక్కమీదే దాని చివరి లాభాలు తేలతాయి. మరోవైపున దిల్ రాజు నిజంగా నక్కను తొక్కి వచ్చాడు. చెలియా, డీజే సినిమాల మిశ్రమ ఫలితాలతో కాస్త వెనకపట్టు పట్టిన దిల్ రాజు ఫిదాతో ఊపిరి పీల్చుకున్నాడు. అదే విధంగా ఈ సంవత్సరం శతమానంభవతి, నేను లోకర్  మీడియం బడ్జెట్ చిత్రాల ద్వారా మంచి హిట్ సాధించిన దిల్ రాజు ఇప్పుడు ఫిదా అద్బుత విజయం ద్వారా ఒక సంవత్సరంలోనే మూడు హిట్ సినిమాల రికార్డును సొంతం చేసుకున్నాడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments